SSMB29 : భారతీయ సినిమా రంగంలో అత్యంత జనాదరణ పొందిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తను ఏది తీసినా అది ఓ సంచలనం. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు ఎస్ఎస్ఎంబీ29(SSMB29) చిత్రంలో. ఇప్పటి దాకా హైదరాబాద్ తో పాటు ఒడిశా అడవుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా కాశీ ఆధ్యాత్మిక ప్రాంతంలో సెట్ వేశారు. ఈ చిత్రానికి భారీ ఎత్తున డిమాండ్ నెలకొంది. జక్కన్న తండ్రి చిత్రానికి కథ రాశారు. ఎప్పటి లాగే ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
SSMB29 Movie Updates
విజువల్ ఎఫెక్ట్స్ ను అద్భుతంగా తెర మీదకు ఎక్కించడంలో తనకు తనే సాటి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తను సినిమా తీశాడంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. ఎలాంటి మూవీస్ కు సంతకం చేయకుండా ప్యాకప్ చేశాడు డైరెక్టర్. ఇది తన నైజం. షూటింగ్ ఆలస్యమైనా ఆ సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం. ఇది తన స్పెషాలిటీ. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
వచ్చే ఏడాది 2026 వరకు ఎస్ఎస్ఎంబీ 29 మూవీ షూటింగ్ కొనసాగుతుందని సినీ వర్గాల భోగట్టా. తాజాగా ఓ కీలక అప్ డేట్ వచ్చింది. సినిమా రెండు భాగాలుగా రాబోతోందని , ఇప్పటికే ఈ విషయాన్ని ఎస్ఎస్ రాజమౌళి సినీ బృందానికి హింట్ కూడా ఇచ్చేశాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా చిత్రం మూడున్నర గంటలకు పైగా సమయం ఉంటుందని టాక్. ప్రిన్స్, జక్కన్న సినిమాను కేఎల్ నారాయణ తన బ్యానర్ లో నిర్మిస్తుండడం విశేషం.
Also Read : Beauty Rashmika : రౌడీతో రష్మిక డేటింగ్ ..పెళ్లికి రెడీనా..?