Rajamouli : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌలి అలియాస్ జక్కన్న(Rajamouli) ఆస్కార్ అవార్డు(Oscar) కమిటీ తీసుకున్న తాజాగా నిర్ణయంపై స్పందించారు. ప్రశంసలు కురిపించారు. వర్దమాన దర్శకులకు ఈ నిర్ణయం మరింత ఊపును కలిగించేదిలా ఉందని పేర్కొన్నారు. తాను తీసిన ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఆస్కార్ పురస్కారం దక్కింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా జక్కన్న పేరు పరిచయం అయ్యింది. ఆయన చేసే ప్రతి ట్వీట్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉండగా ఈసారి ఆస్కార్ అవార్డుల ఎంపిక కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
Rajamouli Happiness
అదేమిటంటే మూవీస్ కేటగిరీలలో కొత్త స్టంట్ డిజైన్ కేటగిరీని కూడా చేర్చుతున్నట్లు వెల్లడించింది కమిటీ. దీనిని తాను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే తాను తీసిన రుధిరం రౌద్రం రణం (ఆర్ఆర్ఆర్) ఇప్పటికీ ప్రకటనలో ఉండటం పట్ల మరింత ఆనందం కలుగుతోందన్నారు.
ఇదిలా ఉండగా ఆస్కార్ అవార్డుల అకాడెమీ కీలక ప్రకటన చేసింది. వివిధ సినిమాల నుండి మూడు స్టంట్ సన్నివేశాలను ప్రదర్శించే పోస్టర్ ను షేర్ చేసింది. ఇందులో స్టంట్ లు ఎల్లప్పుడూ సినిమాల మాయాజాలంలో భాగంగా ఉన్నాయని, ఇప్పుడు ఇవి ఆస్కార్ లలో భాగం కాబోతున్నాయంటూ పేర్కొంది.
వచ్చే 2027లో ప్రకటించే ఆస్కార్ అవార్డుల కేటగిరీలో స్టంట్ డిజైన్ కూడా భాగం కానుంది. ఈ సందర్బంగా అకాడెమీ మరో విషయాన్ని పంచుకుంది. అదేమిటంటే 2028లో 100వ ఆస్కార్ తో ప్రారంభిస్తామని, ఇందులో 2027లో విడుదలైన చిత్రాలను కూడా గౌరవిస్తుందని పేర్కొంది. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రాజమౌళి. ఈ చారిత్రాత్మక గుర్తింపును సాధ్యం చేసినందుకు డేవిడ్ లీచ్, క్రిస్ ఓహారా , స్టంట్ కమ్యూనిటీకి, స్టంట్ వర్క్ శక్తిని గౌరవించినందుకు ఆస్కార్ అకాడెమీ సీఈవో బిల్ క్రామెర్ , అధ్యక్షుడు జానెట్ యాంగ్ లకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Chhaava OTT Sensational :ఓటీటీలో ఛావా కోసం నిరీక్షణ