SS Rajamouli : ఎస్ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చిత్ర దర్శకుడిగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలిసి పోయాడు. తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. టేకింగ్ లో మేకింగ్ లో తనకు ఎవరూ సాటి రారని తేల్చి చెప్పాడు. ఆయన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ , ఆలియా భట్ తో తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం కోట్లు కొల్లగొట్టింది.
SS Rajamouli RRR Got Six Awards
జాతీయ , అంతర్జజాతీయ స్థాయిలో అవార్డులు స్వంతం చేసుకుంది. ప్రత్యేకించి ఆస్కార్ అవార్డును సాంగ్ పరంగా దక్కించింది. తాజాగా జాతీయ అవార్డులు ప్రకటించగా ఇందులో పెద్ద ఎత్తున పురస్కారాలు ఆర్ఆర్ ఆర్ చిత్రానికి దక్కాయి.
ఏకంగా ఈ మూవీకి ఆరు అవార్డులు లభించడం విశేషం. పుష్పకు రెండు అవార్డులు దక్కాయి. రాజమౌళి(SS Rajamouli) తీసిన ప్రతి చిత్రం డిఫరెంట్ గా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అందుకే ఆయన వద్దన్నా అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఉత్తమ జన రంజక చిత్రంగా ఆర్ఆర్ఆర్ అవార్డును దక్కించు కోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఆయన భావుకుడు, బాగా చదువుతాడు. అంతే కాదు ప్రకృతి అంటే విపరీతమైన ఇష్టం. ఎక్కువగా ఏ మాత్రం సమయం చిక్కినా తన భార్యతో కలిసి సుందరమైన ప్రదేశాలు తిరుగుతుంటాడు. ఇదీ ఆయన స్పెషాలిటీ. అందుకే రాజమౌళిని నటీ నటులే కాదు నిర్మాతలు సైతం రాజువయ్యా అంటున్నారు.
Also Read : Sukumar : బన్నీ ఆనందం సుకుమార్ సంతోషం