SS Rajamouli: తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి తాజాగా మరో ఘనత సాధించారు. ఆస్కార్స్ అకాడమీలో మెంబర్‌గా ఉండేందుకు ఆయనకి ఆహ్వానం అందింది. రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా ఈ ఆహ్వానం అందడం విశేషం. దీనితో 2025 ఆస్కార్స్‌లో వీరు ఓటేందుకు అవకాశం దక్కింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 487 మందికి ఈ ఆహ్వానం దక్కింది. దీంతో 2025 ఆస్కార్‌లలో ఓటు వేసేందుకు ఈ మెంబర్లు అర్హత పొందారు. ఇంతటి గౌరవం దక్కించుకున్నందుకు రాజమౌళికి అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
SS Rajamouli….
ఇక రాజమౌళి, రమా రాజమౌళితో పాటు మన దేశం నుంచి షబానా అజ్మీ, రితేష్ సిధ్వాని, రవి వర్మన్, రీమా దాస్, శీతల్ శర్మ, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహుజా, హేమల్ త్రివేది, గితేష్ పాండ్యాలకి కూడా అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. గత సంవత్సరం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, కె కె సెంథిల్ కుమార్, సాబు సిరిల్ వంటి వారికి అకాడమీలో చోటు దక్కింది.
అకాడమీలో చోటు దక్కిన సభ్యులకి అనేక ప్రత్యేక అధికారాలు ఉంటాయి. వారు చిత్ర పరిశ్రమ ప్రమాణాలను ప్రభావితం చేస్తూ ప్రతి సంవత్సరం ఆస్కార్ విజేతలకి ఓటు వేస్తారు. అలానే వీరికి ప్రత్యేకమైన స్క్రీనింగ్ లు, ప్రీమియర్ లు, నెట్ వర్కింగ్ అవకాశాలకి అర్హత ఉంటుంది. సభ్యులు వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, అకాడమీ లైబ్రరీని యాక్సెస్ చేసే అవకాశాన్ని కూడా పొందుతారు. వీరు కమిటీలలో పనిచేస్తారు… ఆస్కార్స్ కార్యక్రమాలలో పాల్గొంటారు. అకాడమీ ప్రచురణలను పొందొచ్చు. అలానే ఎమర్జింగ్ టాలెంట్‌ను గుర్తించి.. సినిమా భవిష్యత్తుకి వారి వంతు సహయం చేసే అవకాశం దక్కుతుంది.
తెలుగు సినిమాను ప్రపంచవేదికపై సగౌరవంగా నిల్చోబెట్టిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli). ఆయన తీసిన ఈగ, బాహుబలి 1, 2 చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులిపితే ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా దేశానికి ఆస్కార్ తీసుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆయన అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇక తాజాగా రాజమౌళి మరో ఘనతను కూడా సాధించారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్… సింపుల్‌గా చెప్పాలంటే ఆస్కార్స్ అకాడమీలో చేరమని రాజమౌళికి ఆహ్వనం అందింది.
ఇక కెరీర్ విషయానికొస్తే రాజమౌళి(SS Rajamouli) ప్రస్తుతం SSMB29 చిత్రాన్ని ప్రారంభించే పనిలో ఉన్నారు. మహేష్ బాబుతో తీస్తున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే క్యాస్టింగ్ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అయితే కేవలం మహేష్ బాబు పేరు మాత్రమే ప్రకటించారు. అయితే ఖచ్చితంగా ఈ సినిమాతో భారత చలనచిత్రం స్థాయి మరో లెవల్‌కి వెళ్తుందని రాజమౌళి అభిమానులు నమ్ముతున్నారు.
Also Read : Kalki 2898 AD Updates : రిలీజ్ కు ముందే యూఎస్ లో రికార్డుల మోత మోగిస్తున్న కల్కి