SS Rajamouli : ‘పుష్ప 2’ సినిమాకి భారీ హైప్ ఇచ్చిన జక్కన్న

పాన్‌ ఇండియా స్థాయిలో ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది...

Hello Telugu - SS Rajamouli

SS Rajamouli : “సుకుమార్‌ లేకపోతే నేను లేను. ఇంత గొప్ప దర్శకుడు మన దగ్గర ఉన్నారా అని గర్వపడేలా చేశారు. ఈ సినిమా కోసం మేమందరం జీవితాలు పెట్టాం. మా అందరికీ గుర్తుండిపోయే సినిమా కావాలని కోరుకున్నా’’ అని అల్లు అర్జున్‌ అన్నారు.సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప2’ రష్మిక కథానాయిక. శ్రీ లీల ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లోవైల్డ్‌ ఫైర్‌ జాతర పేరుతో ఈవెంట్‌ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎస్‌.ఎస్‌.రాజమౌళి(SS Rajamouli) అతిథిగా హాజరయ్యారు.

SS Rajamouli Comment

అయన మాట్లాడుతూ “ఏదైనా సినిమా వేడుకకి వచ్చినప్పుడు మన మాటలతో ఆ సినిమాకి ఏదో రకంగా మంచి జరగాలనే ఉద్దేశంతో మాట్లాడుతుంటాం. ఈ సినిమా గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సినిమాని పొగడటం కంటే ఒక సరదా విషయం పంచుకుంటా. రెండు మూడు నెలల కిందట రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘పుష్ప2’ చిత్రీకరణ జరుగుతుంటే అక్కడిరి వెళ్లా. బన్నీ, సుక్కుతో కాసేపు మాట్లాడిన తర్వాత ‘సినిమాలో ఒక సన్నివేశం చూస్తారా?’ అని అడిగారు సుకుమార్‌. పుష్పరాజ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ అది. ఆ ఒక్క సీన్‌తో అర్థమైపోయింది. ఈ సన్నివేశానికి దేవిశ్రీప్రసాద్‌ ఎంత సంగీతం ఇవ్వగలిగితే అంత తీసుకోండి అని చెప్పా. సుకుమార్‌ ఎంత స్థాయికి కావాలంటే అంత స్థ్థాయికి తీసుకెళ్లాడు. బన్నీ నటనతో అదరగొట్టేశాడు. దాని తర్వాత సినిమా మొత్తం ఎలా ఉంటుందో, డిసెంబరు 4నే ప్రపంచానికి అర్థమైపోతుంది. వర్షం పడుతుంది. ఇది శుభ సూచకం’’ అన్నారు.

Also Read : Shraddha Kapoor : కొత్తింటికి మారిన బాలీవుడ్ అగ్ర నటి ‘శ్రద్ధా కపూర్’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com