SS Rajamouli: భారతీయ సినిమాను ముఖ్యంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తేవడమే కాకుండా ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టింది. హలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సహా ఎంతోమంది అంతర్జాతీయ సినిమా ప్రముఖులను ఈ సినిమా కట్టి పడేసింది. ఈ సినిమా విడుదలై రెండేళ్ళు దాటినా… ప్రపంచంలో ఎదో మూలన ఇంకా ఆడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ జపనీస్ వెర్షన్ ను ఇటీవల జపాన్ లో విడుదల చేసారు. దీనితో జపాన్ లో జరుగుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్క్రీనింగ్ కోసం రాజమౌళి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా జపాన్ ప్రజలు రాజమౌళిపై ఎనలేని అభిమానాన్ని చూపిస్తున్నారు.
SS Rajamouli Thanks..
ఈ నేపథ్యంలో జపాన్ లో 100 ఏళ్లనాటి పురాతన మ్యూజికల్ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్ సినిమాను 110 ఏళ్ల నాటి తకరాజుకా సంస్థ నిర్వహించే మ్యూజికల్ థియేటర్‌లో ప్రదర్శించడం విశేషం. ఆర్ఆర్ఆర్ చిత్రంలాగే ఈ మ్యూజికల్ షోపై కూడా ప్రేమ చూపిన జపనీస్ ఆడియన్స్‌కు ధన్యవాదాలు. మీ రెస్పాన్స్ చూస్తే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ షోలో మీ శక్తి, ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ ఈవెంట్‌లో భాగమైన అమ్మాయిలను అభినందించకుండా ఉండలేకపోతున్నా’ అంటూ రాజమౌళి ట్విటర్‌లో పోస్ట్ చేసారు. దీనితో రాజమౌళి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ ఈ దర్శకధీరుడి అభినందిస్తున్నారు.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో త్వరలో సినిమా ప్రారంభం కాబోతుంది. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం కాబోయే ఈ సినిమాను సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల చెప్పిన మాటల ప్రకారం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే అడ్వంచరెస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఈ సినిమాలో యాక్షన్ స్వీక్వెన్స్, ఫిట్ నెస్ మరియు కొత్త లుక్ కోసం మహేశ్ బాబు ఇప్పటికే జర్మనీ వెళ్లి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్‌గా… హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ కీలకపాత్ర పోషించనున్నారని కూడా టాక్ నడుస్తోంది.
Also Read : Saiee Manjrekar: సల్మాన్ మాటే శాసనం అంటున్న ఏకలవ్య శిష్యురాలు సయీ మంజ్రేకర్ !