SS Rajamouli: ఎప్పుడూ పని మీద ధ్యాసతో తన పని తాను చూసుకుంటూ టాలీవుడ్ మోస్ట్ మిస్టర్ ఫర్ఫెక్ట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. టాలీవుడ్ నుండి హాలీవుడ్ రేంజ్ కు తన పేరు మారుమ్రోగినా… అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడుతూ చాలా డీసెంట్ గా ఉంటారు. తన సొంత సినిమా ప్రమోషన్లు, అప్పుడప్పుడు బాగా తెలిసిన, ముఖ్యమైన ఈవెంట్లకు మాత్రమే రాజమౌళి హాజరవుతూ తన స్ట్రైల్ లో అక్కడి అతిథులను ఆకట్టుకుంటారు. ఏ పని చేసినా అది సినిమా అయినా, ఈవెంట్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ ను భాగస్వామ్యులను చేస్తూ వర్క్ ను ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీమెన్ గా గుర్తింపు పొందారు రాజమౌళి.
SS Rajamouli Dance Viral
ఫ్యామిలీమెన్‌గా గుర్తింపు పొందిన రాజమౌళి తరుచూ ఏ ప్రదేశానికి వెళ్లినా కుటుంబంతోనే వెళ్తూ ఉంటాడు. అలాంటిది తాజాగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు తన భార్య రమా రాజమౌళితో(SS Rajamouli) కలిసి వెళ్లారు. అయితే ఆ ఫంక్షన్ లో ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి ఉత్తరాలకే అనే పాటకు తన భార్య రమతో కలిసి ఆయన డ్యాన్స్ వేసారు. ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా రాజమౌళిలో డ్యాన్స్ కళ కూడా ఉండటంతోనే ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు. అప్పుడప్పుడు తనలోని డ్యాన్స్ టాలెంట్ ను ఇలాంటి సందర్భాల్లో బయటపెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలాఉండగా ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి(SS Rajamouli)… సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను కథను సిద్ధం చేయగా… ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఫారెస్ట్ అడ్వంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కబోయే ఈ సినిమాకోసం మహేశ్ బాబు… ఇటీవలే ఓ స్పెషలిస్ట్ ట్రైనర్ సమక్షంలో జిమ్ శిక్షణ తీసుకుని… స్క్రీన్ టెస్టులు కూడా పూర్తి చేశారు. ఈ సినిమా కోసం ఓ హాలీవుడ్ నటిని కథానాయుకగా సెలక్ట్ చేసినట్లు సమాచారం.
Also Read : Athiya Shetty: తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి ?