దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను అపారమైన గర్వంతో మేడ్ ఇన్ ఇండియాను ప్రదర్శిస్తున్నానని తెలిపారు ఎస్ఎస్ రాజమౌళి.
తాను మొదట కథనం విన్నానని, అది గత్యంతరం లేని భావోద్వేగంగా తనను ఎంతగానో కదిలించిందని స్పష్టం చేశారు దర్శకుడు. సినిమాలు ఎవరైనా తీస్తారు. కానీ బయో పిక్ (జీవిత చరిత్ర ) తీయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఎస్ఎస్ రాజమౌళి.
కానీ భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే గురించి ఆలోచించడం అంటే అది మరింత సవాలుతో కూడుకుని ఉన్నదని పేర్కొన్నారు. మా అబ్బాయిలు ఇందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉండగా మేడ్ ఇన్ ఇండియా బయో పిక్ కు నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ గుప్తా, కార్తికేయ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మేడ్ ఇన్ ఇండియా బయె పిక్ పై ఉత్కంఠ నెలకొంది.