దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది. దీంతో యావత్ ప్రపంచం దృష్టి జక్కన్నపై పడింది. ఆయన ప్రభాస్ తో తీసిన బాహుబలి సూపర్ హిట్. ఇక ఆర్ఆర్ఆర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఆ తర్వాత సినిమా ఎవరితో తీస్తాడని, కథ ఎలా ఉంటుందోననే ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. తన సినిమా కథ పూర్తయిందని, కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని పేర్కొన్నాడు. ఇందు కోసం ప్రిన్స్ మహేష్ బాబును ఎంపిక చేసినట్లు ప్రకటించాడు.
తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ రాస్తున్నాడు. కథలు రాయడంలో , అందులో దేశ భక్తిని ఉండేలా చొప్పించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. మహేష్ , రాజమౌళి అనే సరికల్లా అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటి నుంచే మార్కెట్ లో చర్చ కొనసాగుతోంది.
అయితా తాజా సమాచారం మేరకు ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందట. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమా రానుందని హింట్ ఇచ్చాడు రాజ మౌళి. ఈ చిత్రంలో మహేష్ బాబు వరల్డ్ ను చుట్టేస్తాడని క్లారిటీ ఇచ్చాడు. స్క్రిప్టు కూడా పూర్తయిందని టాక్.
ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారంలో నటిస్తున్నాడు.