Sriya Reddy: ‘కేజీయఫ్’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘సలార్(Salaar)’. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ‘రాధా రమ మన్నార్’ పాత్రతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది నటి శ్రియారెడ్డి. ‘రాధా రమ మన్నార్’ పాత్ర ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
దీనితో ‘రాధా రమ మన్నార్’ పాత్రతో పాన్ ఇండియా గుర్తింపు పొందిన నటి శ్రియారెడ్డి… తదుపరి నటించబోయే నెక్స్ట్ సినిమాపై చర్చ ప్రారంభమైయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తోన్న ‘ఓజీ’లో శ్రియారెడ్డి(Sriya Reddy) కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీనితో ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో నటి శ్రియారెడ్డి ‘ఓజీ’ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం శ్రియారెడ్డి(Sriya Reddy) వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Sriya Reddy – పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అని నాకు తెలియదు- శ్రియారెడ్డి
ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో శ్రియారెడ్డి మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న ‘ఓజీ’ సినిమాలో నా పాత్ర ఎంతో కీలకం. సుజిత్ అదిరిపోయే కథ రాశారు. పవన్‌కల్యాణ్‌ను కలిసే వరకూ ఆయన అంత పెద్ద స్టార్ అనే విషయం నాకు తెలియదు. ఆయన స్టార్‌డమ్‌ను నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నానని ప్రకటించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా.. ‘మీరు మా దేవుడితో వర్క్ చేస్తున్నారు కదా’ అని చాలామంది నన్ను అడుగుతున్నారు.
పవన్ కళ్యాణ్ కు విశేషమైన ప్రజాదరణ ఉంది. సెట్‌లో కలిసినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు. పవర్‌స్టార్‌తో కలిసి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నా. ఇందులో నాది నెగెటివ్ రోల్ కాదు. కానీ, నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. అభిమానులతో కలిసి ఫస్ట్‌డే తొలి షో చూసేందుకు ఎదురుచూస్తున్నా’’ అని ఆమె తెలిపారు. దీనితో శ్రియారెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ‘రాధా రమ మన్నార్’ కంటే పవర్ ఫుల్ పాత్రలో ‘ఓజీ’లో కనిపించాలంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శ్రియారెడ్డి… ‘అప్పుడప్పుడు’ అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత విశాల్ హీరోగా నటించిన ‘పొగరు’ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ఆ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. శుక్రవారం విడుదలైన ‘సలార్’ లో పృథ్వీరాజ్ సుకుమారన్ సోదరి ‘రాధా రమ మన్నార్’ పాత్రలో శ్రియారెడ్డి నటించారు. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలో నటించనున్నారు.
Also Read : Hero Rajinikanth: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న రజనీ లాల్ సలాం ?