Sriranga Neethulu: సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానీశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాకు ప్రవీణ్‌కుమార్ వీఎస్‌ఎస్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకువచ్చి… ఫరవాలేదు అనిపించుకున్న ఈ సినిమా ఏ ఓటీటీలో వస్తుందా అని… నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా ఈ మూవీ నేరుగా యూట్యూబ్ లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. మే 30వ తేదీన భవానీహెచ్‌డీ మూవీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఇదే విషయాన్ని సదరు యూట్యూబ్ ఛానల్ ఎక్స్ వేదికగా పోస్టర్ ను షేర్ చేసింది.
Sriranga Neethulu – ‘శ్రీరంగ నీతులు’ కథేమిటంటే ?
‘శ్రీరంగ నీతులు(Sriranga Neethulu)’ అనేది మూడు కథల సమాహారం. టెక్నీషియన్‌గా పనిచేసుకుంటూ బస్తీలో జీవితం కొనసాగిస్తున్న శ్యాంసంగ్ శివ (సుహాస్)కి ఫ్లెక్సీల పిచ్చి. రాజకీయ నాయకుడితో కలిసి ఫొటో తీయించుకుని, దాన్ని అందరూ చూసేలా ఫ్లెక్సీ వేయిస్తాడు. తన గురించి బస్తీలో మాట్లాడుకోవాలనేది ఆశ. కానీ ఆ ఫ్లెక్సీ తెల్లారేసరికి కనిపించదు. తనంటే పడని మరో గ్యాంగ్ వల్లే ఫ్లెక్సీ మాయమైందని వాళ్లతో గొడవకి దిగుతాడు. మళ్లీ శివ ఫ్లెక్సీ వేయించాడా అనేది కీలకం. కార్తీక్ (కార్తీక్ రత్నం)ది మరో గొడవ. జీవితంలో అనుకున్నది సాధించలేకపోయానని మద్యానికీ, గంజాయికీ బానిస అవుతాడు. తన కొడుకు మారితే చూడాలనుకున్న తండ్రి (దేవిప్రసాద్)కి అంతలోనే మరో తలనొప్పి. ఇంట్లో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిన్న కొడుకు కోసం పోలీసులు ఇంటికొస్తారు. ప్రేమికులైన ఐశ్వర్య (రుహానీశర్మ), వరుణ్ (విరాజ్ అశ్విన్)లది మరో సమస్య. ప్రేమించుకున్నా ఆ విషయాన్ని ఇంట్లో పెద్దలకి చెప్పే ధైర్యం లేక సతమతమవుతుంటారు. మరి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయనేది మిగిలిన కథ.
Also Read : Zahid Wasim: ‘దంగల్’ నటి ఇంట్లో విషాదం !