Srimanthudu Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “శ్రీమంతుడు” సినిమా వివాదంపై చిత్ర యూనిట్ ఎట్టకేలకు స్పందించింది. 2015 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా… తాను స్వాతి పత్రికలో రాసిన ‘చచ్చేంత ప్రేమ’ కథను కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సమర్ధించాయి. దీనితో ఇటీవలే కొరటాల శివ తరపున లాయర్లు సుప్రీంకోర్టులో వేసిన తమ పిటీషన్ ను ఉపసంహరించుకోనున్నట్లు కోర్టుకు తెలిపారు.
Srimanthudu Movie Case Updates
అయితే ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో రచయిత శరత్ చంద్ర మాట్లాడుతూ… శ్రీమంతుడు(Srimanthudu) సినిమా యూనిట్ నుండి నేను డబ్బు ఆశించలేదని… స్క్రిప్ట్ తనదేనని దర్శకుడు అంగీకరిస్తే చాలని అన్నారు. ఈ విషయంలో సినీ పెద్దలు రాజీ కుదర్చడానికి ప్రయత్నించారని అన్నారు. ప్రస్తుతం రచయిత శరత్ చంద్ర వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనితో తాజాగా ఈ వివాదంపై చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.
రచయిత శరత్ చంద్ర వ్యాఖ్యలపై శ్రీమంతుడు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ స్పందిస్తూ… ‘‘శ్రీమంతుడు’, ‘చచ్చేంత ప్రేమ’.. రెండూ పబ్లిక్ డొమైన్‌లోనే ఉన్నాయి. వేటికవే విభిన్నం. పుస్తకం, సినిమాను పరిశీలించి ఈ వాస్తవాన్ని గుర్తించొచ్చు. ప్రస్తుతం ఈ వ్యవహారం లీగల్ రివ్యూలో ఉంది. అందువల్ల అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఓపికగా వ్యవహరించండి. చట్టపరమైన ప్రక్రియపై మాకు నమ్మకం ఉంది’’ అని పేర్కొంది. దీనితో ఎట్టకేలకు శ్రీమంతుడు చిత్ర యూనిట్ ఈ వివాదంపై స్పందించినట్లైయింది.
Also Read : Radha Madhavam Movie : శ్రీకాంత్ చేతుల మీదుగా ‘రాధా మాధవం’ ట్రైలర్ రిలీజ్