Sridevi : భారతీయ సినీ చరిత్రలో చెరపలేని జ్ఞాపకం శ్రీదేవి(Sridevi). తన మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కానీ వాటన్నింటిని పక్కన పెడితే తను పరిణతి చెందిన నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకుంది. భారతీయ సినీ దిగ్గజంగా ఇప్పటికీ ఎప్పటికీ కొలిచేలా చేసుకుంది. శ్రీదేవి అంటేనే అమాయకత్వం, అద్బుతం. ఇంతకు మించి ఏం చెప్పగలం. తను 2018లో ఈ లోకం నుంచి వెళ్లి పోయింది. ఎందరికో కన్నీళ్లను మిగిల్చింది.
Sridevi Memories
మహిళా దినోత్సవం సందర్బంగా తనను మరోసారి గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. శ్రీదేవి(Sridevi) ఆగస్టు 13, 1963లో పుట్టింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో నటించింది. లెక్కలేనన్ని అవార్డులు, లెక్కించలేని పురస్కారాలు. తను బోణికపూర్ ను చేసుకుంది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. తన స్వస్థలం తమిళనాడులోని శివకాశి. ఆమె దుబాయ్ లోని ఓ హోటల్ లో అనుమానస్పద మృతికి లోనైంది. ఇప్పటికీ ఆమె మరణం ఓ మిస్టరీగా మారింది. తన తల్లికి తానే చితికి నిప్పంటించింది. అప్పట్లో సంచలనం సృష్టించింది శ్రీదేవి.
కాగా మిథున్ చక్రవర్తితో కొంత కాలం రహస్యంగా ఉన్నదని ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. హీరో అనిల్ కపూర్ సోదరుడిని పెళ్లి చేసుకుంది. బాల నటిగా 1967లో తమిళ చిత్రం కన్దన్ కరుణై లో నటించింది. 1976లో కె. బాలచందర్ తీసిన మూండ్రు ముడిచ్చులో కమల్, రజనీతో కలిసి నటించిన ఈ మూవీ మంచి పేరు తీసుకు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో వీరి కాంబినేషన్ లో వచ్చాయి. 1975-85 సమయంలో శ్రీదేవి తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయికగా వెలుగొందారు.
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలలో శ్రీదేవి కథానాయికిగా నటించింది. జగదేక వీరుడు అతిలోక సుందరి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1978లో హిందీలోకి ప్రవేశించింది. సోల్వా సావన్ తో. జితేంద్ర తో కలిసి హిమ్మత్ వాలాలో నటించింది. ఇది ఇండియాలో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. సద్మ, నగీన, మిస్టర్ ఇండియా, చాందిని, చాల్ బాజ్ చిత్రాలు బంపర్ సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్ లో భిన్నమైన పాత్ర పోషించింది. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
Also Read : Popular Actress Bhanupriya : విలక్షణ నటీమణి భానుప్రియ