Sridevi: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని అతి తక్కువ మంది నటీమణుల్లో శ్రీదేవి ఒకరు. నాలుగేళ్ళ వయసులో బాల నటిగా సినిమాల్లో అడుగుపెట్టిన శ్రీదేవి… తన వెర్సటైల్ యాక్టింగ్, సృజనాత్మకమైన నటనతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటిగా గుర్తింపు పొందారు. అతిలోక సుందరిగా ప్రేక్షకుల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని… హిందీ, తెలుగు. తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఏకైక అగ్ర తారగా నిలిచారు.
ఆమె ఏ భాషలో పని చేసిన తనకంటూ ప్రత్యేకంగా స్థానం సంపాదించుకున్న శ్రీదేవి(Sridevi)… ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకున్నారు. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చిన తరువాత కూడా చాలా సినిమాల్లో నటించారు. అయితే 54 ఏళ్ళ వయసులో 2018లో దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తూ బాత్ టబ్బులో మునిగి చనిపోయారు. తన నటనకు గాను ఎన్నో అవార్డులు అందుకున్న శ్రీదేవిని… భారత ప్రభుత్వం పద్మ శ్రీ తో సత్కరించింది.
Sridevi – ఈ నెల 16 నుండి ప్రారంభం కానున్న ఖజురహో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్
ఖజురహో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 16న ప్రారంభం కానుంది. వారంపాటు జరిగే ఈ వేడుకను అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి అంకితం ఇవ్వనున్నట్టు ఖజురహో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ప్రకటించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు శ్రీదేవి చేసిన సేవలకు గానూ ఈ వేడుక ద్వారా ఆమెకు ఆమెకు ఘనమైన నివాళి అర్పిస్తామని’’ నిర్వాహకుల్లో ఒకరైన రాజా బుందేలా తెలిపారు.
ఈ నెల 16 నుండి 22 వరకూ జరిగబోయే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో బోనీ కపూర్, గుల్షన్ గ్రోవర్, హరీశ భీమని, అలీఖాన్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఖజురహో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పలు భారతీయ, విదేశీ చిత్రాలు ప్రదర్శించనున్నారు.
Also Read : Samuthirakani: కమ్యూనిస్టు ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని ?