Sri Sri Sri Rajavaru: హ్యట్రిక్ హిట్ కు సిద్ధమౌతోన్న ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ !

హ్యట్రిక్ హిట్ కు సిద్ధమౌతోన్న ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ !

Hello Telugu - Sri Sri Sri Rajavaru

Sri Sri Sri Rajavaru: ‘మ్యాడ్’ ‘ఆయ్’ వంటి చిత్రాలతో యూత్‌ని ఎంటర్టైన్ చేస్తూ హిట్ మీద హిట్టుతో దూసుకెళుతోన్న టాలీవుడ్ యంగ్ హీరో నార్నె నితిన్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి మ్యాన్ ఆప్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్.. తనకంటూ ఓ పంథాని ఏర్పరచుకుని.. నటుడిగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం ఈ దసరాకు భారీగా, అత్యధిక థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.

Sri Sri Sri Rajavaru Movie Updates

నార్నె నితిన్ హీరోగా.. జాతీయ అవార్డు విన్నర్, ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు(Sri Sri Sri Rajavaru)’ అనే చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. సంపద హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన మీడియాకు తెలియజేశారు.

ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ… ముందుగా మమ్మల్ని, మా బ్యానర్‌ని ఆదరిస్తున్న అఖిలాంధ్ర ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్‌తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు(Sri Sri Sri Rajavaru)’ విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్‌లో భారీ తారాగణంతో తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. తారక్ ఎంతో మెచ్చి… ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ దసరాకి నార్నె నితిన్ ఖాతాలో ‘ఆయ్, మ్యాడ్’ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అందుకే ఈ సినిమాను భారీగా, అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు చర్చలు జరుపుతున్నామని అన్నారు.

Also Read : Nindha: ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్న వరుణ్‌సందేశ్‌ ‘నింద’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com