Sreerama Chandra: ఇండియన్ ఐడల్ (2010) విజేత శ్రీరామ చంద్ర గురించి పరిచయం అవసరం లేదు. అతను సంగీత విద్వాంసుడిగా తన వృత్తిని ప్రారంభించాడు మరియు ఎనిమిదేళ్ల వయస్సులో పాడటం ప్రారంభించాడు. అతను అనేక సంగీత పోటీలలో పాల్గొని ట్రోఫీలు గెలుచుకున్నాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమాలకు పాటలు పాడిన అయన 2010లో ఇండియన్ ఐడల్ కాంటెస్ట్‌లో పాల్గొని ఫైనల్‌లో గెలిచి తెలుగు బలం ఏంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో పాటలు పాడి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు.
Sreerama Chandra Updates
12 సంవత్సరాల తర్వాత, మరోసారి సోనీ టెలివిజన్ లో సందడి చేయనున్నారు. శ్రీ రామ చంద్ర(Sreerama Chandra) సోనీ టీవీ సెలబ్రిటీ డ్యాన్స్ షో ‘ఝలక్ దిఖ్ లా జా’లో పాల్గొంటున్నారు. టోర్నీలో అతను సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ట్రోఫీని గెలుచుకోవడంలో తెలుగు ప్రజలందరూ తమ గొంతుకకు మద్దతు ఇవ్వాలని సంగీత కళాకారులు విజ్ఞప్తి చేశారు.
Also Read : Pankaj Udhas : ప్రముఖ గజల్ సింగర్ ‘పంకజ్ ఉదాస్’ తుది శ్వాస విడిచారు