Sreeleela : టాలీవుడ్ కు సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ ఏది చేసినా ఓ సంచలనమే. వాళ్లు తీసిన ప్రతి మూవీ బిగ్ హిట్ . తాజాగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ , రష్మిక మందన్న, శ్రీలీల(Sreeleela) కలిసి నటించిన పుష్ప -2 ది రూల్ దుమ్ము రేపింది. భారత దేశ చరిత్రలో అత్యధిక వసూలు చేసిన రెండో చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 1876 కోట్లు సాధించింది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నితిన్ రెడ్డి, శ్రీలీలతో కలిసి రాబిన్ హుడ్ మూవీ తీస్తున్నారు.
Sreeleela Trying to…
చిత్రం చిత్రీకరణకు సంబంధించి తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎక్స్, సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇందులో లవ్లీ బ్యూటీ శ్రీలీల తనకు ఆస్కార్ కావాలంటూ అడగడం, హీరో ఆమెను ఆట పట్టించడం, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ సరదాగా కామెంట్స్ చేయడం భలే ఫన్నీగా అనిపించింది.
ఇక ఇప్పటికే రాబిన్ హుడ్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పోస్టర్స్, సాంగ్స్ కెవ్వు కేక అనిపించేఆల ఉండడంతో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. పూర్తిగా కామెడీ, రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి నుంచే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మైత్రీ మూవీ మేకర్స్.
ఈ సినిమాకు తమిళ సినీ రంగానికి చెందిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండడం, విడుదలైన రెండు పాటలు దుమ్ము రేపడంతో రాబిన్ హుడ్ హిట్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్.
Also Read : Prudhvi Raj Shocking Comment :పోసాని అరెస్ట్ పృథ్వీ రాజ్ కామెంట్స్