Sreeleela : అందాల ముద్దుగుమ్మ శ్రీలీల సంచలనంగా మారారు. తనతో డ్యాన్స్ చేయాలంటే దమ్ముండాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బహిరంగంగానే స్టార్ హీరో. ఆయన ఎవరో కాదు అందరికి కలల రాకుమారుడిగా పేరొందిన ప్రిన్స్ మహేష్ బాబు. తనతో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన గుంటూరు కారం చిత్రంలో ఇద్దరూ ఇరగ దీశారు. ఆ పాట ఇప్పటికీ టాప్ లో కొనసాగుతోంది. అదే కుర్చీ మడత పెట్టి. ఈ పాటకు శ్రీలీల(Sreeleela) చేసిన డ్యాన్స్ తో తాను తట్టుకోలేక పోయానంటూ పేర్కొన్నాడు.
Sreeleela- Karthi Dance
ఇక తాజాగా నితిన్ రెడ్డితో కలిసి వెంకీ కుడుముల తీస్తున్న చిత్రం రాబిన్ హుడ్. దీనికి తమిళ సినీ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ సంగీతం ఇస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి విడుదలైన రెండు పాటలు భారీ ఆదరణ చూరగొన్నాయి. చార్ట్స్ లో టాప్ లో కొనసాగుతున్నాయి. ఈ పాటల్లో నితిన్ రెడ్డి కంటే శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసిందన్న టాక్ వచ్చింది.
తాజాగా శ్రీలీల వైరల్ గా మారారు. అదేమిటంటే బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కు సంబంధించిన కుటుంబ వేడుకల్లో తను పాల్గొన్నారు. అంతే కాదు డ్యాన్స్ తో హోరెత్తించారు. దీంతో ఫ్యాన్స్ మాత్రం కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య ఏదో నడుస్తోందని, డేటింగ్ లో కూడా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ కారణంగా శ్రీలీల ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. నెట్టింట్లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుండడం విశేషం.
Also Read : Rashmika- MLA Ravi Issue Shocking :ముదిరిన వివాదం రష్మిక మౌనం