Sreeleela : క్రేజీ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల మళ్ళీ జోరు పెంచింది. పెళ్లి సందడితో తెరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ ‘ధమాకా’ యూత్ హార్ట్స్ పేల్చేసింది. నెక్స్ట్ ఏకంగా ‘గుంటూరు కారం’లో మహేష్ సరసన నటించి కెరీర్ పీక్ ని చూసింది. అనంతరం వరుస ప్లాప్ లతో డీలా పడింది. అయితే రీసెంట్ గా ‘కిస్సిక్’ సాంగ్ తో మెరిసిన ఆమె మరోసారి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఆమె సిద్దు జొన్నలగడ్డ, రవితేజలతో సితార బ్యానర్ లో రెండు సినిమాలు సైన్ చేశారు. తాజాగా అఖిల్ అక్కినేనితో మరో సినిమాని ఆమె సితార బ్యానర్ లో సైన్ చేశారు. ఈ సినిమాకి వినరో భాగ్యము విష్ణుకథ సినిమా డైరెక్టర్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని సితారతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అలాగే నాగ చైతన్యతో విరూపాక్ష డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా శ్రీలీలే(Sreeleela) యాక్ట్ చేయనుంది. ఏది ఏమైన ‘కిస్సిక్’ సాంగ్ తో శ్రీలీల కెరీర్ లో మళ్ళీ జోష్ పెరిగింది.
Sreeleela in…
మరో వైపు ఆమె ఇటీవల బాలయ్య ఆన్‌స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఆమె మాట్లాడుతూచిన్నప్పుడు అమ్మ నన్ను ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంతో బిజీగా ఉంచేది. ఎప్పుడూ చదువుకోమని చెప్పేది. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే.. అమ్మ పెడుతున్న కండీషన్స్ వాళ్లకు చెప్పి బాధపడేదాన్ని. అమ్మ అంత క్రమశిక్షణతో పెంచడం వల్లే ఇప్పుడు ఈస్థాయిలో ఉన్నాను. అందుకు గర్వంగా ఉంది. నా కోసం అమ్మ 20 సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేసింది అని శ్రీలీల భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read : Mohan Babu : పోలీసుల అదుపులో నటుడు మోహన్ బాబు