Sreeleela : వామ్మో శ్రీలీల అలా కూడా డబ్బు సంపాదిస్తోందా?

వామ్మో శ్రీలీల అలా కూడా డబ్బు సంపాదిస్తోందా?

Hello telugu-sreeleela

Sreeleela :  యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్ అనేది లేకుండా వరస సినిమాలతో తన దూసుకెళ్తోంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ, ప్రస్తుతం టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది. గుంటూరు కారం, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ తో స‌హా అర‌డ‌జ‌న్ చిత్రాలతో చాలా బిజీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీలీల పేరే వినిపిస్తుంది.

Sreeleela :

ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఈ యంగ్ బ్యూటీ సినిమాల ద్వారానే కాకుండా ప్ర‌మోష‌న్స్ ద్వారా కూడా డ‌బ్బు సంపాదిస్తుంద‌ట‌. అంటే ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌డానికి కూడా రెమ్యున‌రేష‌న్స్ ఛార్జ్ చేస్తుందా అని అనుకుంటున్నారా? అది కాదండోయ్.. ఈ అమ్మడు చేతి నిండా సినిమాలు ఉండ‌టంతో శ్రీ‌లీల(Sreeleela) డేట్స్ దొర‌క‌డం గ‌గ‌నం అయిపోయింది.దీంతో ప్ర‌మోష‌న్స్ కు హాజ‌రు అయ్యే టైమ్ ఆమెకు అస్స‌లు ఉండ‌టం లేదు. ఈ నేప‌థ్యంలోనే నిర్మాత‌లు రెమ్యున‌రేష‌న్ కాకుండా మ‌రో రూ. 12 ల‌క్ష‌లు అద‌నంగా ఇచ్చి ఆమెను ప్ర‌మోష‌న్స్ కు తీసుకొస్తున్నార‌ని టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ వామ్మో శ్రీలీల ఇలా కూడా డబ్బు సంపాదిస్తుందా అని ముచ్చటిస్తున్నారు.

Also Read : KTR : రష్మికపై కేటీఆర్ సరదా కామెంట్స్.. ఏమన్నాడంటే?

 

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com