Sreeleela : టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది శ్రీలీల(Sreeleela). ఈ మధ్యనే సుకుమార్ దర్శకత్వం వహించిన బన్నీ నటించిన పుష్ప-2 చిత్రంలో స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసింది. కుర్రకారుని ఆకట్టుకుంది. ఈ సాంగ్ వైరల్ గా మారింది. దీంతో బాలీవుడ్ కన్ను ఈ అమ్మడిపై పడింది.
Sreeleela Love with
తన కెరీర్ లో ఇప్పుడు ఫుల్ బిజీగా మారి పోయింది శ్రీలీల. ఇందులో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. కీలకమైన పాత్రలకు ఎంపికైంది. ప్రస్తుతం దర్శకుల హీరోయిన్ గా మారి పోయింది శ్రీలీల. ప్రస్తుతం బాలీవుడ్ లో అరంగేట్రం చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు సంతకం కూడా చేసేసింది.
ఇప్పటికే బాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో నటించనుంది. దీంతో ఈ వార్త ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే గత రెండేళ్లుగా నటనలో శిక్షణ పొందుతున్నాడు సైఫ్ కొడుకు. కొత్త హీరోయిన్ ను పరిచయం చేయాలని మూవీ మేకర్స్ డిసైడ్ కావడంతో ఠక్కున శ్రీలీల ఎంపికైంది.
ఈ చిత్రానికి సంబంధించి ఫోటో సెషన్ జరిగింది. ఇబ్రహీం అలీ ఖాన్, శ్రీలీల మూవీ ప్రొడక్షన్ ఆఫీస్ వెలుపల కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సెటిల్ కావాలనే యోచనలో ఉంది ఈ ముద్దుగుమ్మ. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : Marco Movie : 100 కోట్ల వసులు చేసిన ‘మార్కో’ సినిమాను బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు