Sreeleela : ఆ బాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో పడ్డ తెలుగు హీరోయిన్

ఇదిలా ఉంటే సినిమాలైతే వరుసగా చేస్తుంది కానీ హిట్స్ మాత్రం పడటం లేదు...

Hello Telugu - Sreeleela

Sreeleela : తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది అందాల భామ శ్రీలీల(Sreeleela). కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తుంది. ఇప్పుడు ఏ హీరో చూసిన శ్రీలీలే హీరోయిన్ గా కావాలి అంటున్నారు. అంతలా ఈ అమ్మడి డిమాండ్ పెరిగిపోయింది. పెళ్ళిసందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత రవితేజ ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అంతే ఆ తర్వాత ఈ చిన్నది వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ కుర్రాది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించింది ఈ అమ్మడు.

Sreeleela Love Story…

ఇదిలా ఉంటే సినిమాలైతే వరుసగా చేస్తుంది కానీ హిట్స్ మాత్రం పడటం లేదు. ధమాకా సినిమా తర్వాత శ్రీలీల(Sreeleela) చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఒక్క భగవంత్ కేసరి సినిమా తప్ప. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ అంతా బాలయ్యకే చెందిది. రీసెంట్ గా స్పెషల్ సాంగ్ లో మెప్పించింది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అంటూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది ప్రేమలో పడిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా బాలీవుడ్ యంగ్ హీరోతో..

అసలు మ్యాటర్ ఏంటంటే.. శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. త్వరలోనే ఈ చిన్నది హిందీలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమాకు బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడని తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఓ అందమైన ప్రేమ కథగా తెరకెక్కనుందట. ఇటీవల హీరో కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ.. నేను ఇప్పటికే ప్రేమలో మూడుసార్లు విఫలమయ్యాను. అందుకే నాల్గవసారి మళ్లీ ప్రేమలో పడ్డాను. అయితే ఈసారి ఇంతకు ముందులాగా కాకూడదని కోరుకుంటున్నాను అంటూ.. తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు ఈ సినిమాకు సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో శ్రీలీల బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Kiara Advani : ‘గేమ్ ఛేంజర్’ హీరోయిన్ పై నెటిజన్ల సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com