Sreeja Konidela : కొత్త వ్యాపారం మొదలు పెట్టిన చిరంజీవి చిన్నకూతురు శ్రీజ

ప్రస్తుతం కొత్త వ్యాపారానికి మారుతున్నారు...

Hello Telugu - Sreeja Konidela

Sreeja Konidela : మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోని దాదాపు అందరు సినీ పరిశ్రమలో ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది. అయితే ఆమె రెండో కూతురు శ్రీజ కొణిదెల మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆమె సినిమా రంగానికి దూరంగా ఉంది. ఈ మెగా గర్ల్ ప్రస్తుతం తన పిల్లలతో కలిసి చిరంజీవి ఇంట్లో ఉంటోంది.

ప్రస్తుతం కొత్త వ్యాపారానికి మారుతున్నారు. దీనికి సంబంధించి శ్రీజ(Sreeja Konidela) సోష‌ల్ మీడియాలో “కొత్త ప్ర‌యాణం మొద‌లైంది.. అంటూ శ్రీజ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. శ్రీజ హైదరాబాద్‌లో స్టూడియో హిస్ అనంత అనే ఫిట్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించింది. మనస్సు మరియు శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడానికి జిమ్ మరియు యోగా వంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవానికి టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కసాండ్రా, బాలీవుడ్ ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు శిల్పాశెట్టి ఉన్నారు.

Sreeja Konidela New..

ఈ ఫిట్‌నెస్ సెంటర్‌లో భాగమైనందుకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నానని శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ కేంద్రంలో జిమ్ మరియు యోగా సౌకర్యం కూడా ఉన్నాయి. శ్రీజ కొంతమంది పరిచయస్తులతో ఈ జిమ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Also Read : Manjummel Boys OTT : ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీ రిలీజ్ కంఫర్మ్ చేసిన మేకర్స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com