Sree Vishnu: ఆశక్తికరంగా శ్రీవిష్ణు ‘శ్వాగ్‌’ టీజర్‌ !

ఆశక్తికరంగా శ్రీవిష్ణు 'శ్వాగ్‌' టీజర్‌ !

Hello Telugu - Sree Vishnu

Sree Vishnu: ‘రాజ రాజ చోర’ వంటి హిట్‌ సినిమా తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్‌ గోలి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా సినిమా ‘శ్వాగ్‌’. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ వంటి హిట్ సినిమాల తర్వాత ‘శ్వాగ్‌’తో వస్తున్న శ్రీవిష్ణుపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘శ్వాగ్‌’ టీజర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఎంతో వినోదాత్మకంగానే కాకుండా ఆసక్తిగా కూడా ఈ టీజర్‌ మెప్పిస్తుంది.

Sree Vishnu Movie Updates

తాజాగా విడుదలైన టీజర్‌ను బట్టి చూస్తే సినిమాపై మంచి అంచనాలు పెట్టుకోవచ్చు. సినిమా కాన్సెప్ట్‌ కూడా అందరినీ మెప్పించేలా ఉంది. శ్వాగణిక వంశానికి చెందిన వాడిగా శ్రీవిష్ణు విభిన్న గెటప్పులతో అలరించాడు. శతాబ్దాల క్రితం పురుషుల ఉనికికే ముప్పు పొంచి ఉన్న కాలంలో, వింజమర వంశానికి చెందిన రాణి రుక్మిణీ దేవి పురుషులపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంది, తనకు ఒక కొడుకు పుడితే చంపడానికి కూడా వెనుకాడదు. అయితే రాజవంశంపై ఒక శాపం చివరికి పరిస్థితిని రివర్స్ చేస్తుంది. ఇది క్రమంగా మార్పుకు దారితీస్తుంది. అక్కడ పురుషులు స్త్రీలపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు.

శ్రీ విష్ణు(Sree Vishnu)…కింగ్, భవభూతి, సింగ, యయాతి వంటి విభిన్నమైన పాత్రలలో అద్భుతంగా అలరించారు. క్వీన్ రుక్మిణీ దేవిగా రీతూ వర్మ మెప్పించింది. టీజర్‌ లో మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ వంటి ఇతర పాత్రలు కూడా కీలకంగా ఉన్నాయి. వేదరామన్ శంకరన్ కెమెరా పనితనం ఇంపాక్ట్ పుల్ గా ఉంది, వివేక్ సాగర్ ఆకట్టుకునే స్కోర్‌తో ప్రతి ఎలిమెంట్‌ను ఎలివేట్ చేశాడు. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని నిర్వహిస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. క్రేజీ అండ్ ఫన్ ఫుల్ టీజర్ విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) మాట్లాడుతూ… మగ మహారాజులకు, మకుటం లేని మహారాణులకు స్వాగనిక వంశానికి స్వాగతం. టీజర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ఇలాంటి కథ నాకు ఇచ్చిన హసిత్ చాలా థాంక్స్. చాలా గొప్ప కథ. ఇండియన్ స్క్రీన్ లో ఇప్పటివరకూ రాలేదు. ఇది మనఅందరి ఇళ్ళలో వున్న పాయింట్ అయినా స్క్రీన్ పైకి ఇప్పటివరకూ రాలేదు. ఇలాంటి కంటెంట్ ని సినిమా చేయడానికి ముందుకువచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్ యూ. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా దమ్ముండాలి. టీంలో అందరికీ థాంక్ యూ. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం.’అన్నారు.

నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ… శ్రీవిష్ణు(Sree Vishnu), హసిత్ తో కలసి రాజ రాజ చోర సినిమా చేశాం. ఇది మా సెకండ్ మూవీ. ఇది కంటెంట్ డ్రివెన్ వెరైటీ మూవీ. కమల్ హసన్ గారి ఇంద్రుడు చంద్రుడు లాంటి సినిమాలు చూసిన ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. ఒక మంచి వెరైటీ కంటెంట్ ని ఇస్తున్నామని అనుకుంటున్నాం’ అన్నారు

డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ తో కొంత అర్ధమైవుంటుంది. జనరేషన్ గా వస్తున్న జెండర్ వార్ టచ్ వుంది. టీజర్ లో కొంచమే చెప్పాం. ఇది అచ్చ తెలుగు సినిమా. కంటెంట్ చాలా మాట్లాడుతుంది. ఇండియన్ కంటెంట్ లో ఇప్పటివరకూ రాలేదు. తాతలు ముత్తతలతో పాటు చూడగలిగే సినిమా. విష్ణు(Sree Vishnu) గారు గ్రేట్ పెర్ఫార్మార్. అన్ని క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఇలాంటి యూనిక్ కంటెంట్ కి సపోర్ట్ చేసిన విశ్వగారికి చాలా థాంక్ యూ’ అన్నారు.

Also Read : Varun Sandesh: వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మోషన్ పోస్టర్ విడుదల !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com