సోషల్ మీడియా వచ్చాక ఏది దాచు కోవడానికి వీలు లేకుండా పోతోంది. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడినా లేదా కామెంట్ చేసినా వెంటనే దానిని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సినిమా రంగానికి సంబంధించి నిత్యం ట్రోల్స్ , ట్రెండింగ్ లు కొనసాగుతున్నాయి.
ఎంతగా ప్రచారంలో వస్తున్నారో అంతగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇప్పుడు నెట్టింట్లో ట్రోలింగ్ కు గురవుతోంది లవ్లీ గర్ల్ శ్రీలీల. ఇటీవలే తను కీలక వ్యాఖ్యలు చేసింది. తాను లిప్ కిస్ కు వ్యతిరేకమని, తన కాబోయే భర్తకు తప్ప ఇంకెవరికీ ఇవ్వనంటూ చిలుక పలుకులు పలికింది. దీంతో ఫ్యాన్స్ ఊరుకుంటారా. శ్రీలీల లిప్ కిస్ అంటూ తెగ వెతికారు గూగుల్ లో.
వెంటనే కుప్పలు తెప్పలుగా శ్రీలీల ముద్దు సీన్ తెరపైకి వచ్చేసింది. దీంతో అమ్మా ముద్దుగుమ్మ ఈ ముద్దు కథ ఏంది అంటూ తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో శ్రీలీల గప్ చుప్ గా మారి పోయింది. ఏదైనా మాట్లాడే టప్పుడు ఆచి తూచి మాట్లాడాలని సూచిస్తున్నారు ఫ్యాన్స్. మొత్తంగా శ్రీలీల ఈ రకంగా హల్ చల్ కావడం విశేషం కదూ.