టాలీవుడ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది ముద్దుగుమ్మ శ్రీలీల. తను పెళ్లి సందడి సీక్వెల్ లో నటించింది. అంతకు ముందు కన్నడలో మెరిసింది. కానీ అంతగా అక్కడ పాపులర్ కాలేదు. తను నటించిన మూవీ ఆశించిన రీతిలో ఆడలేదు. ఇంకేం తనకు ఛాన్స్ రావని అనుకుంది. కానీ రాఘవేంద్ర రావు రూపంలో లక్ వచ్చేసింది. ఇంకేం టాలీవుడ్ లోకి వస్తూనే హిట్ టాక్ తెచ్చుకుంది.
ఆ తర్వాత తననే వెతుక్కుంటూ సినిమాలు వచ్చాయి. దర్శక, నిర్మాతలు ఇప్పుడు శ్రీలీల జపం చేస్తున్నారు. తన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ తో ఆది కేశవ్ లో నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబుతో గుంటూరు కారంలో కీ రోల్ చేస్తోంది.
ఇక ఇప్పటికే విడుదలై రూ.100 కోట్లు దాటేసిన భగవంత్ కేసరి మూవీలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. తండ్రి పాత్రలో బాలకృష్ణ నటిస్తే తనకు కూతురుకుగా శ్రీలీల ఒదిగి పోయింది. మాస్ మహరాజాతో ధమాకాలో నటించి మెప్పించింది. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన స్కందలో రామ్ తో నటించింది. ఇది కూడా హిట్టే.
ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సాంగ్ లో నటిస్తోందని సమాచారం. అందరి కళ్లు శ్రీలీల పైనే ఉన్నాయి. మరి సంక్రాంతికి రానుంది గుంటూరు కారం.