అనిల్ రావిపూడి దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ , శ్రీలీల కలిసి నటించిన భగవంత్ కేసరి చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచి పోతుందని తండ్రికి తగిన కూతురిగా నటించింది శ్రీలీల. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో మునిగి పోయింది. ఈ సందర్భంగా అందాల ముద్దుగుమ్మ శ్రీలీల షాకింగ్ కామెంట్స్ చేసింది.
గ్లామర్ , రొమాంటిక్ సీన్స్ లలో తాను ప్రయారిటీ ఇవ్వబోనంటూ పేర్కొంది. అంతే కాదు ఈ మధ్యన ఐటం సాంగ్స్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారని, తనకు కూడా నటించాలని ఛాన్స్ లు కూడా వచ్చాయని చెప్పారు శ్రీలీల.
అయితే ఇప్పట్లో తాను వాటి వైపు చూడడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తండ్రిగా నందమూరి బాలకృష్ణ నటించగా కూతురుగా శ్రీలీల చేశారు. వీరిద్దరిపై రూపొందించిన ఉయ్యాలో ఉయ్యాల అంటూ తీసిన సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మొత్తంగా శ్రీలీల చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.