Sree Leela : లవ్లీ బ్యూటీ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడుతో డ్యాన్సులు చేయాలంటే హీరోలు సైతం కష్టపడాల్సిందే. ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోహన్ తో కలిసి దర్శకేంద్రుడి దర్శకత్వంలో పెళ్లి సందడిలో సందడి చేసింది. ఆ తర్వాత వరుస మూవీస్ లో నటిస్తూ తనకంటూ మంచి ఇమేజ్ పెంచుకుంది. కానీ ఎందుకనో తను నటించిన చిత్రాలు ఈ మధ్యన అంతగా ఆకట్టుకోవడం లేదు. తన నటన వరకు ఎలాంటి ఢోకా లేక పోయినా కథా పరంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. దీంతో కొంత ఆందోళన చెందుతోంది ఈ బ్యూటీ.
Sree Leela Movie Updates
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజతో శ్రీలీల(Sree Leela) నటించిన చిత్రం ధమాకా. ఇది ఒక్కటి ఆమెను గట్టెక్కించింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ తో కలిసి పుష్ప-2 బ్లాక్ బస్టర్ మూవీలో స్పెషల్ సాంగ్ లో కిస్సక్ అంటూ కైపెక్కించింది కుర్రకారును. ఆ తర్వాత నితిన్ రెడ్డితో కలిసి వెంకీ కుడుముల తీసిన రాబిన్ హుడ్ లో కీ రోల్ పోషించింది. డ్యాన్సులతో ఇరగ దీసింది. అయినా వర్కవుట్ కాలేదు. ఈ చిత్రం మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ మిశ్రమ స్పందన లభించింది.
శ్రీలీల ఈ మధ్యన చేసిన మూవీస్ లో ధమాకాతో పాటు భగవంత్ కేసరి, గుంటూరు కారం మాత్రమే హిట్స్ గా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రాలలో అంతగా ఫుల్ లెంగ్త్ మూవీస్ సక్సెస్ కాలేదు. స్కంద, ఆది కేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ ఏమంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాబిన్ హుడ్ ఎత్తి పోయిందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హిందీలో ఆషిఖి -3 మూవీలో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తో కలిసి శ్రీలీల నటించింది. దీనిపై ఆశలు పెట్టుకుంది. ఇక తమిళంలో శివ కార్తికేయన్ తో నటిస్తున్న మూవీపై నమ్మకం పెట్టుకుంది.
Also Read : Rakul Preet Singh Shocking :అందుకే స్టార్ డైరెక్టర్ ఆఫర్ ను తిరస్కరించా