తెలుగు సినిమా రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న ఏకైక పేరు శ్రీలీల. కర్ణాటకలో డాక్టర్ కోర్సు చదువుతోంది ఈ ముద్దుగుమ్మ. తొలుత కన్నడ చిత్రంలో నటించింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కన్ను ఈ ముద్దుగుమ్మపై పడింది.
నటుడు శ్రీకాంత్ తనయుడితో కలిసి పెళ్లి సందడి చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన సదరు చిత్రంలో శ్రీలీల నటించింది. అందులో అందాలను ఆరబోసింది. ఆ తర్వాత మనోడి చేతిలో ఎవరు పడినా వాళ్లు టాప్ లోకి వెళ్లిపోయారు. ఆనాటి శ్రీదేవి నుంచి నేటి శ్రీలీల దాకా.
ఈ అమ్మడు ఇప్పుడు మరింత బిజీగా మారి పోయారు. మాస్ మహారాజా రవితేజతో ధమాకాలో నటించింది. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నట సింహం నందమూరి బాలకృష్ణ తో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరిలో నటిస్తోంది.
అంతే కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు తో కలిసి గుంటూరు కారం చిత్రంలో నటిస్తోంది. విచిత్రం ఏమిటంటే లవ్లీ బ్యూటీ పూజా హెగ్డేను తీసేసి దర్శక, నిర్మాతలు శ్రీలీలను పెట్టుకున్నారు. అంతే కాదు కార్తికేయతో ఆది కేశవ్ చిత్రంలో నటిస్తోంది. మొత్తం మీద శ్రీశీల బిజీగా మారి పోయింది.