Speed 220: గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా ‘స్పీడ్220(Speed 220)’. ఈ సినిమాకు హర్ష బీజగం దర్శకత్వం వహిస్తున్నారు. విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ మోపురి సంగీతమందించారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Speed 220 Movie Trailer
ఈ సందర్భంగా తమారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ… ‘ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమా మాదిరి ఒక కొత్త కథ. విభిన్నమైనటువంటి పాత్రలతో చక్కటి దర్శకత్వ ప్రతిభ ఇందులో చూపించారు’ అని కొనియాడారు. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు… ఆర్ఎక్స్ 100 లాంటి మంచి సక్సెస్ అవుతుందన్న నమ్మకముందని దర్శకుడు హర్ష బీజగం అన్నారు.
ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… ‘మంచి కథతో దర్శకుడు హర్ష రావడం జరిగింది. కథ వినిన వెంటనే మా విజయలక్ష్మి ప్రొడక్షన్ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాం.ఇదొక మంచి ప్రేమ కథ. ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమ వల్ల జరిగే ఇబ్బందులు, ప్రేమికులు మధ్యన సంఘర్షణ కళ్లకు కట్టినట్లుగా చూపించేలా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు’ అని అన్నారు. ఈ మూవీని ఆగస్టు 23న విడుదల చేయనున్నారు.