Special Song on Klin Kara: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ కు 2023… తన జీవితంలో గుర్తుండిపోయే సంవత్సరం అవుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దీనికి కారణం సుమారు 11 ఏళ్ళ తరువాత చరణ్ తండ్రి కావడం… ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం. ఈ నేపథ్యంలోనే గత ఏడాది జూన్ లో పుట్టిన తన మనుమరాలికి మెగాస్టార్ చిరంజీవి… క్లీంకార అని నామకరణం చేశారు. క్లీంకారా అనే పేరు ఏదో సాధారణంగా పెట్టిన పేరు కాదు… లలితా సహస్రనామాల నుంచి తీసుకున్న పదం. ‘క్లీంకార’ అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుందని, ఆ పేరులోనే శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని గతంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వెనుక సీక్రెట్ బయటపెట్టారు.
Special Song on Klin Kara Viral
దీనితో అప్పట్లో క్లీంకార పేరు వెనుక ఇంత పెద్ద సీక్రెట్ ఉందా అంటూ నెటిజన్లు అవాక్కయ్యారు. అయితే క్లీంకార పుట్టిన తరువాత అదే విధంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల పెళ్ళి తరువాత వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో… ఈ ఏడాది సంక్రాంతి పండుగను బెంగుళూరులోని ఓ ఫాం హౌస్ లో మెగాస్టార్ కుటుంబం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో మెగా కుటుంబంతో పాటు అల్లు కుటుంబం కూడా సందడి చేసింది. మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ సందర్భంగా మెగాస్టార్ మనుమరాలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) – ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకార గురించి ఓ పాటను రెడీ చేసారు మెగా ఫ్యాన్స్. మహవీర్ ఎల్లందర్ కంపోజ్ చేసిన ట్యూన్‌కు తగ్గట్లుగా బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ రాశాడు. ఈ పాటను ప్రముఖ సింగర్ ధనంజయ్ అద్భుతంగా ఆలపించాడు. దీనితో ఈ పాటను సంక్రాంతి సందర్భంగా ఉపాసన చేతుల మీదుగా విడుదల చేయించారు మెగా ఫ్యామిలీ అభిమానులు. దీనితో ఉపాసన విడుదల చేసిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Guntur Karam Sucess Party: మహేశ్ బాబు ఇంట్లో ‘గుంటూరు కారం’ సక్సెస్ పార్టీ !