Megastar Chiranjeevi: మెగాస్టార్ కోసం త్వరలో గ్రాండ్ ఈవెంట్ ! 

మెగాస్టార్ కోసం త్వరలో గ్రాండ్ ఈవెంట్ ! 

Hello Telugu - Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అతి కొద్దిమంది దిగ్గజ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా కొణిదెల శివశంకర వర ప్రసాద్ గా సినీ పరిశ్రమలోనికి వచ్చి… ఇంతింతై… వటుడింతై మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ… భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన క్రమశిక్షణ, పట్టుదల, కృషి, నిబద్దత, అవమానాలు ఎదురైనా అపజయాలు ఎదురొచ్చిన మొక్కవోని దైర్యంతో ముందుకు వెళ్ళి మెగాస్టార్ గా నిలిచిన ఆయన నట ప్రస్థానం ఎంతో మంది నటులు, దర్శకులు, కొరియోగ్రాఫర్స్, నిర్మాతలతో పాటు సినిమా రంగంలో ఉండే 24 క్రాప్ట్స్ లో పనిచేసే సాంకేతిక నిపుణులకు స్ఫూర్తినిచ్చింది.

Megastar Chiranjeevi Award Event

సినిమాలతో పాటు రక్తదానం, నేత్రదానం వంటి సేవాకార్యక్రమాలు… అభిమానుల గుండెల్లో ఆయన్ను చిరస్థాయిగా చిరంజీవిగా నిలబెట్టింది. ఇప్పటికే పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి ఏన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి… కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో సినీ కార్మికులతోపాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం… దేశ రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ ను ప్రకటించింది.

75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి(Megastar Chiranjeevi) భారతదేశ రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ ను ప్రకటించింది. దీనితో టాలీవుడ్ ప్రముఖులు నటులు, నిర్మాతలు మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఇండియన్ సినిమా ఫెటర్నిటీ అంతా మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాత, తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

తెలంగాణా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవికి(Megastar Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపిన దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ… “మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు రావడం చాలా ఆనందం కలిగించింది. ఇది మెగాస్టార్ తో పాటు తెలుగు సినిమాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. ఈ నేపథ్యంలో ఒక స్పెషల్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేయాలని చూస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాదు పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన స్ఫష్టం చేసారు. దీనితో మెగాస్టార్ కి దక్కిన ఈ అరుదైన గౌరవానికి తెలుగు సినిమా తరపున ఒక గ్రాండ్ ట్రీట్ త్వరలోనే ఉండబోతుంది అంటూ అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Prasanth Varma : వైజాగ్ అమ్మాయి మెయిన్ లీడ్ గా ప్రశాంత్ వర్మ కొత్త సినిమా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com