పూరీ, వినాయక్ బాటలో హరీశ్ శంకర్
Spark Life : న్యూ టాలెంట్ ను గుర్తించడంలో… కొత్త వారిని ప్రోత్సహించడంలో దర్శకులు పూరీ జగన్నాథ్, వివి వినాయక్ తనకు ఆదర్శమని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపారు. దర్శకుడిగా తాను నిలదొక్కుకుంటున్న సమయంలో పూరీ జగన్నాథ్, వివి వినాయక్ ఎంతగానో ప్రోత్సహించేవారని… తన సీనియర్స్ చేసినట్లే తాను కూడా న్యూ టాలెంట్ ను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటాను అన్నారు. విక్రాంత్ రెడ్డి హీరోగా మెహరీన్, రుక్సర్ థిల్లాన్(Rukshar Dhillon) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘స్పార్క్: లైఫ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ హరీశ్ శంకర్… పలు కీలక అంశాలపై మాట్లాడారు.
Spark Life – ‘స్పార్క్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీశ్ సందడి
‘స్పార్క్: లైఫ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మరో టాలీవుడ్ డైరెక్టర్ మారుతి తో కలిసి ముఖ్య అతిధిగా హాజరయిన హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నటించిన సుహాసిని మేడమ్, మెహరీన్, రుక్సర్, మ్యూజిక్ ఇచ్చిన హేషమ్ అబ్దుల్ వాహబ్, గేయ రచయిత అనంత శ్రీరామ్ తప్ప ఇంకా ఎవరూ నాకు తెలియదు. అయినా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చానంటే కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడానికే. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ మధ్య ప్రతి సినిమా వేడుకకు వెళ్తున్నావేంటి? అని చాలామంది నన్ను అడుగుతున్నారు. మరికొందరు సోషల్ మీడియాలోనూ పోస్ట్‌లు పెడుతున్నారు. నేను మాత్రం న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఇటువంటి సినిమా ప్రమోషన్లకు వెళ్తుంటా. ‘స్పార్క్’ ట్రైలర్ చాలా బాగుంది’’ అని అన్నారు. విక్రాంత్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమే ‘స్పార్క్ లైఫ్’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Bandra Tamannah : బాంద్రా జోష్ తమన్నా ఖుష్