South Directors : ప్రస్తుతం నాని హీరోగా నటించిన చిత్రం ‘హాయ్ నాన్నా’. రొమాంటిక్ డ్రామాగా సాగే ఈ సినిమా కథ ప్రధానంగా ముంబై నేపథ్యంలో సాగుతుంది. ఎక్కువ భాగం చిత్రీకరణ కూడా అక్కడే చేసింది యూనిట్. ఉత్తరాది నేపథ్యం అయినప్పటికీ హాయ్ నాన్నా మన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. పూరీ జగన్నాథ్, రామ్ డబుల్ స్మార్ట్ కాంబినేషన్ కూడా ముంబయి నేపథ్యంలో సాగుతోంది. అందుకే చిత్రబృందం తమ చిత్రీకరణ అంతా అక్కడే చేస్తారు. ఈ చిత్రంలో ఉత్తరాది కళాకారులే కాకుండా సంజయ్ దత్‌తో సహా ఉత్తరాదికి చెందిన పలువురు కళాకారులు కూడా ఉన్నారు.
South Directors Viral
శుక్రవారం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ‘లాల్ సలామ్’ చిత్రం కూడా ముంబై నేపథ్యంలోనే తెరకెక్కింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ముంబై డాన్ మోదీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ నటించారు. రెండు వర్గాల క్రికెటర్ల మధ్య తలెత్తిన వివాదాన్ని భాయ్ ఎలా పరిష్కరించాడన్నదే ఈ సినిమా కథాంశం.సౌత్ లో ఫీల్ గుడ్ సినిమాలు డైరెక్ట్ చేసిన శేఖర్ కమ్ముల(Sekhar Kammula) కూడా కథ బ్యాక్ డ్రాప్ ని ముంబైకి మార్చాడు. ధనుష్, నాగార్జున కలిసి చేస్తున్న సినిమా బ్యాక్‌డ్రాప్‌ను రూపొందించి తెరకెక్కిస్తున్నారు. మాఫియా కథకు ముంబై పర్ఫెక్ట్ బ్యాక్‌డ్రాప్ అని శేఖర్ కమ్ముల నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రానికి ‘ధారవి’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన హిస్టారికల్ డ్రామా ‘లక్కీ భాస్కర్’. ఆర్థిక నేరాల నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ కూడా ముంబై నేపథ్యంలో సాగుతుంది. చాలా సౌత్ సినిమాలు ముంబై బ్యాక్‌డ్రాప్‌లో చిత్రికరిస్తున్నారు కాబట్టి స్టార్స్ ఎక్కువ సమయం అక్కడే గడుపుతారు.
Also Read : Sandeep Reddy Vanga :’యానిమల్’ పై వస్తున్న విమర్శలకు వంగా స్ట్రాంగ్ రిప్లై