Sonu Sood : బంగ్లాదేశ్ లో హిందువుల ను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్

‘బంగ్లాదేశ్ నుంచి మన తోటి భారతీయులందరినీ తిరిగి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు కచ్చితంగా చేస్తాం...

Hello Telugu - Sonu Sood

Sonu Sood : మన పక్కదేశమైన బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. రిజర్వేషన్ల అంశంపై అక్కడి విద్యార్థులు, ఉద్యోగులు చేపట్టిన నిరసనలు చిలికి గాలి వానగా మారాయి. ఫలితంగా దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. హింసాత్మక అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్ లో ఇప్పటికే 300 మంది ప్రాణాలు పోగోట్టుకున్నారు. దీని ప్రభావం అక్కడకు వలస వెళ్లిన హిందువులపై కూడా పడింది. హిందువులపై, హిందూ దర్శనీయ స్థలాలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని హిందువుల పరిస్థితిని వివరిస్తూ అక్కడి ఒక మహిళ వీడియోను పోస్ట్ చేసింది. అందులో తమ ప్రాణాలు పోతాయని భయంగా ఉందని, ఎలాగైనా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భారతదేశానికి చేరాలా చూడాలని సదరు మహిళ కోరింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో కాస్తా రియల్ హీరో సోనూ సూద్(Sonu Sood) కంట పడింది. దీనిని చూసి చలించిపోయిన ఆయన వెంటనే ఈ వీడియోను తిరిగి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అనంతరం ఒక సంచలన ప్రకటన చేశాడు.

Sonu Sood Helps..

‘బంగ్లాదేశ్ నుంచి మన తోటి భారతీయులందరినీ తిరిగి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు కచ్చితంగా చేస్తాం. ఇక మీరు ప్రశాంతమైన మంచి జీవితాన్ని పొందుతారు. అయితే ఇది కేవలం మన ప్రభుత్వ బాధ్యతే కాదు.. మనందరి బాధ్యత కూడా.. జై హింద్’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం సోనూ సూద్(Sonu Sood) ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. బంగ్లాదేశ్ మహిళ ఆవేదనపై స్పందించిన సోనూ సూద్ ను ప్రశంసిస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన హిందువులను కాపాడేందుకు భారత ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. 1971లో బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. బంగ్లాదేశ్‌ ప్రభుత్వ నిర్ణయం ఆ దేశ ప్రధాని హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ మద్దతుదారులకే ప్రయోజనం చేకూరుస్తుందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీంతో రిజర్వేషన్లు రద్దు చేయాలనే డిమాండ్‌తో విద్యార్థులు రోడ్డెక్కారు. అది కాస్తా చిలికి గాలి వానగా మారింది.

Also Read : Shine Tom Chacko : ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న రంగబలి విలన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com