Sonia Malhar : హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. తమకు ఎదురైన ఇబ్బందుల గురించి పలువురు నటీమణులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా నటి సోనియా మల్హర్(Sonia Malhar)మాట్లాడుతూ.. ఒక సినిమా షూట్లో తనకెదురైన సంఘటన తెలియజేశారు. షూట్ అనంతరం వాష్‌రూమ్‌కు వెళ్లగా.. అక్కడికి వచ్చిన జయసూర్య తన చేయి పట్టుకుని లాగారని చెప్పారు. భయంతో ఆయన్ని వెనక్కి నెట్టేశానని, దాంతో జయసూర్య తనకు క్షమాపణలు చెప్పారని.. ఇకపై ఇలా చేయనన్నారని సోనియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Sonia Malhar Comment
మలయాళ నటుడు జయసూర్య(Jaya Surya)పై తాను చేసిన వ్యాఖ్యలు నిజమేనని నటి సోనియా మల్హర్ మరోసారి చెప్పుకొచ్చారు. ఆయన వల్ల తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని.. ఈ విషయంపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తనవి తప్పుడు ఆరోపణలు మాత్రమేనని జయసూర్య ఇచ్చిన స్టేట్మెంట్పై తాజాగా ఆమె నేషనల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ నా మాటల్లో నిజం లేదని జయసూర్య అంటున్నారు. నావి తప్పుడు ఆరోపణలు కాదు. చాలా స్పష్టంగా చెబుతున్నా.. నా వ్యాఖ్యల్లో నిజం ఉంది. నా జీవితంలో మొదటిసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇప్పుడే. హేమ కమిటీ రిపోర్ట్ వైరల్‌గా మారిన తరుణంలో ఒక నటుడి వల్ల నేను ఇబ్బందులు ఎదుర్కొన్నానని మీడియా ముందుకు వచ్చి చెప్పా. దానిని కొంతమంది విమర్శించారు. లంచం తీసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నానని కొందరు కామెంట్ చేశారు. ఈ కేసు నేను క్లోజ్ చేయాలనుకోవడం లేదు. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తా’’ అని సోనియా అన్నారు. ఈ విషయంపై ఆమె తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read : Emergency Movie : తగ్గేదేలే అని ఢిల్లీలో ‘ఎమర్జెన్సీ’ పాటలు విడుదల చేసిన లేడీ డాన్