బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినీ కెరీర్ లో మరిచి పోలేని సినిమా ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్కటి ప్రేమ్ రతన్ ధన్ పాయో అని చెప్పింది. ఆ సినిమాలో తాను హైలెట్ కావడానికి ప్రధాన కారణం డ్రెస్సులేనని పేర్కొంది.
వీటిని చాలా వరకు తానే డిజైన్ చేసుకున్నానని ఇది ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదని తెలిపింది. అయితే వీటిని డిజైన్ చేసింది మాత్రం అనామిక అని తెలిపింది సోనమ్ కపూర్. ఆ సినిమా భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా ఉంది. ప్రత్యేకించి కథ, సన్నివేశాలు, సాంగ్స్ ప్రతి ఒక్కరినీ కదిలించేలా చేశాయని ఈ క్రెడిట్ అంతా దర్శకుడికే దక్కుతుందని చెప్పింది ముద్దుగుమ్మ.
విచిత్రం ఏమిటంటే నేను ఈ మధ్య చాలా పెళ్లిళ్లకు వెళ్లాను. అక్కడ అంతా అమ్మాయిలు తాను ధరించిన వాటినే ఆదర్శంగా తీసుకున్నారని, తనను విస్తు పోయేలా చేశారంటూ సంతోషం వ్యక్తం చేసింది.
ఇక దర్శకుడు సూరజ్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. తను తీసిన ప్రతి సినిమా ఓ కళా ఖండం అని కితాబు ఇచ్చింది. గతంలో మాధురీ దీక్షిత్ తో హమ్ ఆప్ కే హై కౌన్ , మైనే ప్యార్ కియా తీశాడు. మాధురీ ఆకు పచ్చ చీర, అమృత రావు పసుపు రంగు ధరించిన విషయాన్ని నాకు చెప్పారని తెలిపింది. మొత్తంగా తన జీవితంలో ఎక్కువగా ఇష్టపడింది ప్రేమ్ రతన్ దన్ పాయో అని మరోసారి పేర్కొంది.