Sonali Bendre : ఈ ప్రపంచంలో అద్బుతమైనది ఏమైనా ఉందంటే అది స్త్రీ. ఆమె లేక పోతే ఈ లోకం లేదు. పునరుత్పత్తికి తను ప్రతీక. ఇక రంగుల లోకాలను ఆవిష్కరించే అద్భుతైన సాధనం సినిమా రంగం. ఒక్కోసారి అదృష్టం తలుపు తడుతుంది. మరోసారి పైనుంచి కిందకు తోసేస్తుంది. ఎవరూ ఊహించని రీతిలో బాలీవుడ్ లో తళుక్కున మెరిసింది సోగకళ్ల సోనాలి బెంద్రే(Sonali Bendre). తనను తాను నటిగా ప్రూవ్ చేసుకుంది. అటు ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా నటించి మెప్పించింది. హృదయాలను మీటింది ఈ ముద్దుగుమ్మ.
Sonali Bendre Sensational
సోనాలి బెంద్రే అంటేనే ముందుగా కుర్రకారుకు గుర్తుకు వచ్చేది మణిరత్నం తీసిన ముంబై మూవీలో మనీషా కొయిరాలాతో పాటు పోటీ పడింది తను. ఇందులో సింగిల్ పాట హమ్మా హమ్మా అంటూ అరబిక్ బ్యూటీని వేటూరి అద్భుతంగా రాస్తే అల్లా రఖా రెహమాన్ సూపర్ గా కంపోజ్ చేశాడు. ఆనాడు విడుదలైన ఈ చిత్రం రికార్డులను బ్రేక్ చేసింది. ఇద్దరూ పోటీ పడి నటించారు. ఆ తర్వాత తెలుగులో విజయ భాస్కర్ తీసిన సూపర్ సక్సెస్ అయిన చిత్రం మన్మథుడు. ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచి పోయింది. ఇందులో సూపర్ గా నటించింది సోనాలి బెంద్రే. అక్కడినే నాగార్జున కీలక పాత్ర పోషించారు.
జనవరి 1 1990లో పుట్టింది. సినీ నటి కాక ముందు మోడల్ గా గుర్తింపు పొందింది. ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించింది. మరాఠీతో పాటు దక్షిణాదిలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో మెరిసింది. 1990లో సోనాలి బెంద్రే టాప్ హీరోయిన్ గా పేరు పొందారు. ఆ తర్వాత అనుకోకుండా క్యాన్సర్ భూతానికి గురయ్యారు. ఆ తర్వాత ఆ రోగాన్ని అధిరోహించారు. ప్రస్తుతం రియాల్టీ షోలో పాల్గొంటున్నారు.
Also Read : Bollywood Beauty Manisha Koirala :వెండి తెరపై వెన్నెల మనీషా కొయిరాలా