Sonakshi Sinha : బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా వివాహం జరిగి సుమారు 2 నెలలైంది. మనసారా ప్రేమించిన జహీర్ ఇక్బాల్‌ని పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడుపుతోందీ అందాల తార. అయితే ఈ మధ్య ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. సోనాక్షి(Sonakshi Sinha) ముంబైలోని తన ఇంటిని అమ్ముతోందట. ఆమె వివాహం ఈ ఇంట్లోనే జరిగింది. అయితే ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన ఈ ఇంటిని హీరోయిన్ అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. పెళ్లి జరిగిన రెండు నెలలకే తన ఇంటిని అమ్మాల్సిన అవసరం సోనాక్షికి ఏమొచ్చింది? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ముంబైలోని బాంద్రాలో సోనాక్షి సిన్హాకు ఒక లగ్జరీ ఇల్లు ఉంది. సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ ఫ్లాట్ చాలా విశాలంగా ఉంటుంది. సుమారు 4200 చదరపు అడుగుల ఈ ఇంట్లో విశాలమైన 2 బెడ్రూమ్లు ఉన్నాయి. అంతేకాదు జిమ్, ప్రైవేట్ లిఫ్ట్ మొదలైన సౌకర్యాలు కూడా ఉన్నాయి.
Sonakshi Sinha House..
అయితే ఇప్పుడు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ఇంటి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో ఇంట్లోని ప్రతి గదిని చూపించారు. అయితే ఇందులో సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) ఇల్లు అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఇది సోనాక్షి ఇల్లు అని కరాఖండిగా చెబుతున్నారు. దీనికి తోడు ఈ వీడియోను స్వయంగా సోనాక్షి సిన్హా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ చేసింది. ఇక ఈ లగ్జరీ ఇంటి ధర 25 కోట్ల రూపాయలు! ముంబై నగరంలో ఇంత ఎక్కువ ధరకు ఆస్తిని విక్రయించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇటీవలే పెళ్లి చేసుకున్న సోనాక్షి సిన్హా తన ఇంటిని ఎందుకు అమ్ముతోందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వివాహం కూడా ఇదే ఇంట్లో జరిగింది. మరీ ఇంత సడెన్ గా ఎందుకు ఇంటిని విక్రయానికి పెట్టుందో సోనాక్షినే చెప్పాలి. కాగా ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ ‘దబంగ్’ మూవీతో నటిగా సినిమా కెరీర్ మొదలుపెట్టింది. దక్షిణాదిలోనూ రజనీకాంత్ ‘లింగా’ సినిమాలో హీరోయిన్గా చేసింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. గతంలో తనతో పాటు నటించిన జహీర్ ఇక్బాల్‌తో చాన్నాళ్ల క్రితమే ప్రేమలో పడింది. ఈ ఏడాది జూన్‌లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.
Also Read : Kiran Abbavaram : హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి పనులు ఇక షురూ అయినట్లే..