ఈ మధ్య సినిమా రంగానికి సంబంధించి చిత్ర విచిత్రమైన వార్తలు గుప్పుమంటున్నాయి. నాగార్జున తనయుడు నాగ చైతన్యతో డేటింగ్ లో ఉన్నట్టు, త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది నటి శోభిత ధూళిపాళపై.
దీనికి కారణం కూడా లేక పోలేదు. వీరిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇవ్వడం ఇందుకు మరింత ఊతం పోసింది. నెట్టింట్లో నాగ చైనత్య, శోభిత కు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. మరో వైపు ప్రముఖ నటి సమంత రుత్ ప్రభు ప్రస్తుతం విచిత్రమైన వ్యాధితో బాధ పడుతున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండతో ఖుషీ మూవీలో నటించింది. అందులో కాస్తా శృతి మించి నటించిందన్న టాక్ కూడా ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రం నాగ చైతన్య మీద కోపంతో అలా చేసిందన్న ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా పెళ్లి చేసుకున్న సామ్ , చైతూ ఉన్నట్టుండి విడి పోతున్నట్లు ప్రకటించారు.
ఆ తర్వాత మౌనంగానే ఉన్న నాగ చైతన్య ఇప్పుడు శోభితను పెళ్లి చేసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించింది శోభిత ధూళిపాళ. తాము ఫ్రెండ్స్ మాత్రమేనని డేటింగ్ అంటూ ఏమీ లేదని పేర్కొంది.