టాలీవుడ్ లో దమ్మున్న డైరెక్టర్ గా పేరు పొందాడు బోయపాటి శ్రీను. నందమూరి బాలయ్యతో అఖండ తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత ప్రస్తుతం రామ్ పోతినేని, శ్రీలీలతో కలిసి తీసిన మూవీ స్కంద. ఈ చిత్రం సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ , టీజర్ ఆకట్టుకుంది. విపరీతమైన అంచనాలు పెంచేసింది మూవీపై .
తనదైన ముద్ర ఉండేలా చూడడంలో ఎక్స్ పర్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. రచన, దర్శకత్వం డిఫరెంట్ గా ఉండేలా చూశాడు. ఎం. రత్నం ఈ చిత్రానికి మాటలు రాశారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ మూవీలో రామ్ పోతినేని, శ్రీలీల , ప్రిన్స్ సిసిల్ నటించారు.
సంతోష్ డేటా కే ఛాయాగ్రహణం అందించగా ఎస్ఎస్ థమన్ సంగీతం ఇచ్చారు. ఇప్పటికే స్కంద మూవీకి సంబంధించి ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేసేలా చేసింది. ప్రస్తుతం ఈ మూవీపై భారీ నమ్మకం పెట్టుకున్నారు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ , జీ స్టూడియోస్ స్కంద చిత్రాన్ని సమర్పించాయి. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో టికెట్లు అమ్ముడు పోయాయి.