టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్, డైనమిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి శ్రీను. తను ఎక్కువగా బాలయ్య బాబుతో సినిమాలు తీశాడు. ఆ మధ్యన తీసిన అఖండ దుమ్ము రేపింది. వయొలెన్స్ తో పాటు కుటుంబ బాంధవ్యాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడు దర్శకుడు.
ఇదే సమయంలో ఇస్మార్ట్ శంకర్ తో తన స్టామినా ఏమిటో రుచి చూపించిన హీరో రామ్ పోతినేనితో స్కంద తీశాడు. ఇది సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది. దాదాపు రూ. 50 కోట్ల దాకా వసూలు చేసింది. ఇందులో లవ్లీ గర్ల్ శ్రీలీల కూడా నటించింది.
రామ్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా పూరీ జగన్నాథ్ తో నటిస్తుండగా స్కంద మూవీకి సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. భారీ ధరకు డిస్నీ హాట్ స్టార్ ఈ చిత్రం రైట్స్ చేజిక్కించుకున్నట్లు టాక్. టాలీవుడ్ లో దీనిని రూ. 30 కోట్లకు పైగానే సదరు సంస్థ చెల్లించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాగా ఇప్పటికే డిస్నీ హాట్ స్టార్ అక్టోబర్ 27న స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించింది. కానీ ఇవాళ స్ట్రీమింగ్ కాక పోవడంతో బోయపాటి, రామ్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఇదిలా ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే నెల నవంబర్ లో వచ్చే దీపావళి పండగకు రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.