తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ స్వంతం చేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయనకు మినిమం గ్యారెంటీ కలిగిన డైరెక్టర్ గా గుర్తింపు ఉంది. ఇప్పటికే నట సింహం బాలయ్య బాబుతో తీసిన అఖండ అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది.
ఆ తర్వాత పూర్తి మాస్ అప్పీల్ తో రామ్ పోతినేనిని పెట్టి స్కంద మూవీ తీశాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్ కిర్రాక్ తెప్పించేలా ఉన్నాయి. ఇక పూరీతో రామ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ లో రామ్ నటన పీచ్ లోకి వెళ్లింది.
ఆ తర్వాత రామ్ నటించిన మూవీ ఆశించిన మేర రాణించ లేదు. కానీ బోయపాటితో తీసిన స్కందలో ఎక్కువగా కష్టపడ్డాడు. అంతకు మించి దర్శకుడి అభిరుచికి తగ్గట్టుగానే నటించి మెప్పించాడు. ఈ సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారనుంది శ్రీలీల.
ఈ మధ్య జరిగిన ఈవెంట్ లో దర్శకుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వర్తమాన తారకు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. ప్రిన్స్ తో గుంటూరు కారంలో నటిస్తోంది. ఇక స్కంద చిత్రం సెప్టెంబర్ 28న రానుంది. విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ తేదీ ఖరారు చేశారు.