డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రైజింగ్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల నటించిన స్కంద మూవీ బిగ్ సక్సెస్ సాధించింది. ఆశించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఒక రకంగా రామ్ లోని మాస్ ను మరోసారి రివీల్ చేయడంలో బోయపాటి ప్రయత్నం ఫలించింది. ఇదిలా ఉండగా స్కంద మూవీ అభిమానులకు ఖుష్ కబర్ చెప్పారు మూవీ మేకర్స్.
ఈ మేరకు ఓటీటీ ప్రేక్షకులకు ఆనంద వార్తను చేర వేశారు. అక్టోబర్ 27 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. దీంతో రామ్ , శ్రీలీల ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు. ఎందుకంటే థియేటర్ల లోకి వెళ్లకుండా ఉన్న వాళ్లు, పని ఒత్తిళ్ల మధ్య సినిమాను చూడని వాళ్లకు ఇప్పుడు ఓ టీటీ ఒక వెసులుబాటుగా మారింది.
ఇక స్కంద విషయానికి వస్తే కథ డామినేట్ చేసింది. ముఖ్యంగా బోయపాటి అంటేనే సినిమా నిండుగా ఉంటుంది. కుటుంబాలు, బాంధవ్యాలు, మనుషులు, మమతలు ఇవన్నీ ఉండేలా జాగ్రత్త పడతాడు. ఎప్పటి లాగే వయెలెన్స్ ను కూడా వంద శాతం ఉంచేలా చూశాడు. ఇక మరోసారి ఎస్ఎస్ థమన్ వాయించాడు.