టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ కలిగి ఉన్న డైరెక్టర్ బోయపాటి శ్రీను. అందాల తార శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ అందించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య స్కంద విడుదలైంది. ఆశించిన దాని కంటే కలెక్షన్లు వచ్చినా రాను రాను తగ్గే ప్రమాదం లేక పోలేదని మూవీ మేకర్స్ ఆందోళన చెందుతున్నారు.
బోయపాటి అంటేనే హింస ఎక్కువగా ఉంటుంది. అంతకు మించి డైలాగులు కూడా భారీగా ఆకట్టుకునేలా ఉంటాయి. గతంలో ఎన్నడూ లేనంతగా యంగ్ ఎనర్జటిక్ హీరోగా పేరు పొందాడు రామ్ పోతినేని.
ఓపెనింగ్స్ మాత్రం అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. తొలి రోజు ఏకంగా రూ. 18 కోట్లకు పైగా కలెక్షన్లు రావడంతో ఒకింత సంతోషానికి లోనవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రామ్ తన సినీ కెరీర్ లో భారీగా వసూలు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం.
ఎప్పటి లాగే ఊర మాస్ ను ఆకట్టుకునేలా తీశాడు బోయపాటి శ్రీను. రెండో రోజు కలెక్షన్ల పరంగా చూస్తే రూ. 3.5 కోట్లు వసూలు సాధించింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని డబ్బులు వసూలు చేస్తుందనేది వేచి చూడాలి. మొత్తంగా లవ్లీ గర్ల్ శ్రీలీల నటన హైలెట్ గా నిలిచింది.