బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన రామ్ పోతినేని, శ్రీలీల నటించిన స్కంద మూవీ ఆశించిన దానికంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. మొదట మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ రాను రాను బోయపాటి మార్క్ జనాన్ని సినిమా చూసేందుకు రప్పించేలా చేస్తున్నాయి.
మాస్ లుక్స్ తో హోరెత్తించాడు రామ్. ఇక శ్రీలీల నటన, డ్యాన్సులతో హోరెత్తించింది. థియేటర్ల వద్ద మాస్ జాతర కొనసాగుతోంది. ప్రత్యేకించి బీ, సీ సెంటర్లలో స్కంద దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
అదిరి పోయే కలెక్షన్లతో రామ్ సినీ కెరీర్ లో అత్యుత్తమ చిత్రంగా నిలిచింది స్కంద. ఇస్మార్ట్ శంకర్ తో ఆకట్టుకున్న రామ్ మరోసారి తనదైన మార్క్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కలెక్షన్ల పరంగా చూస్తే హాఫ్ సెంచరీ దాటింది. మూవీ మేకర్స్ అంచనాల ప్రకారం రూ. 50 కోట్ల మార్క్ దాటిందని సమాచారం.
మొత్తంగా ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తే రామ్ పోతినేని, శ్రీలీలకు బిగ్ సక్సెస్ ఈ స్కంద ఇచ్చిందని చెప్పక తప్పదు. బోయపాటి డైలాగులు కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.