Madharasi : తమిళ సినీ రంగంలో శివ కార్తికేయన్ హైలెట్ గా మారాడు. తనను దళపతి విజయ్ వారసుడిగా భావిస్తున్నారు. నటనా పరంగా పీక్ స్టేజ్ లోకి తీసుకువెళ్లేలా తనను తాను మల్చుకుంటున్నాడు. ప్రస్తుతం తను డైనమిక్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న మదరాసి(Madharasi) చిత్రంలో ఫుల్ బిజీగా మారాడు. షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. చివరి దశలో ఉందని సమాచారం. ఇప్పటికే సర్కార్ తో తన సత్తా ఏమిటో చాటిన ఏఆర్ మురుగదాస్ కు ఈ ఏడాది కలిసి రాలేదని చెప్పక తప్పదు.
Shiva Karthikeyan -Madharasi Movie Updates
తను బాలీవుడ్ సూపర్ స్టార్ , కండల వీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో కలిసి సికిందర్ తీశాడు. ఇది తన సినీ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. టేకింగ్, మేకింగ్ బాగానే ఉన్నా ఉత్తరాది వారిని, ప్రత్యేకించి హిందీ ప్రేక్షకుల మనసు ఆకట్టు కోలేక పోయిందంటూ సినీ క్రిటిక్స్ పేర్కొంటున్నారు. ఇది పక్కన పెడితే తన మూవీ ఫెయిల్ కావడంతో తదుపరి ప్రాజెక్టు మదరాసిపై దృష్టి సారించాడు ఏఆర్ మురుగదాస్.
ఇక శివ కార్తికేయన్ విషయానికి వస్తే నటనతో పాటు కథపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. పరాశక్తి చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో శ్రీలీల కీ రోల్ పోషిస్తోంది. సుధా కొంగర దర్శకత్వం వహిస్తుండగా జయం రవి ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే మదరాసి మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్ మరింత అంచనాలు పెంచేలా చేసింది. ఈ మేరకు తాజాగా కీలక అప్ డేట్ ఇచ్చాడు శివ కార్తికేయన్ . స్వయంగా వచ్చే సెప్టెంబర్ 5వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించాడు. విచిత్రం ఏమిటంటే సరిగ్గా ఇదే తేదీన విజయ్ నటించిన గోట్ కూడా వచ్చింది. మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read : Beauty Tamannaah-Odela 2 :ఓదెల 2..అర్జున్ సన్నాఫ్ వైజయంతి నువ్వా నేనా