ఎవరీ సితార అనుకుంటున్నారా. దివంగత నట శేఖర కృష్ణ మనువరాలు. ప్రముఖ నటుడు ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టి. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఆసక్తికరమైన ట్వీట్ చేస్తూ మరింత వైరల్ గా మారింది.
ఈ మధ్యన ఎక్కడికి వెళ్లినా తెగ హల్ చల్ చేస్తోంది. ఓ వ్యాపార సంస్థ ప్రకటనలో కూడా కనిపించింది..చాలా మందిని ఆకట్టుకుంది కూడా. ఈ తరుణంలో ప్రపంచ సినిమా దినోత్సవం పురస్కరించుకుని లవ్లీ సితార కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా అనేది నా డీఎన్ఏలో ఉందని స్పష్టం చేసింది సితార. తనకు మూవీస్ అంటే ఇష్టమని, తన తాత కృష్ణ అంటే తనకు వల్లమాలిన అభిమానమని పేర్కొంది. తాతయ్య నుంచి ఎందరో స్పూర్తి పొందారని, తాను కూడా ఆయన వారసురాలిగా గుర్తింపు తెచ్చుకుంటానని స్పష్టం చేసింది.
ఇందుకోసం తను కూడా ఫుల్ ప్రాక్టీస్ చేస్తోంది. ఓ వైపు గౌతమ్ సామాజిక సేవా కార్యక్రమాలతో ఆకట్టుకున్నాడు. ఇక మహేష్ బాబు ఉచితంగా పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. తాజాగా తాను కూడా సినిమాల్లోకి వస్తానని, హీరోయిన్ గా చేయాలని ఉందంటోంది సితార.