Sirish Bhardwaj : మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్‌ను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పల్మనరీ ఫెయిల్యూర్‌తో శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
Sirish Bhardwaj No More
2007లో శిరీష్ భరద్వాజ్, మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. కొన్నేళ్ల తర్వాత మనస్పర్థల కారణంగా 2014లో విడిపోయారు. ఇద్దరికీ పిల్లలు పుట్టారు. ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ మరో పెళ్లి చేసుకున్నట్లు కూడా తెలిసింది. శిరీష్ భరద్వాజ్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అయితే శిరీష్ భరద్వాజ్ గుండెపోటుతో చనిపోయాడని శిరీష్ స్నేహితులు అతని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read :Hero Darshan : మరో కేసులో నిందితుడిగా కన్నడ హీరో దర్శన్