Sini Shetty: మిస్ వరల్డ్ ఫైనల్స్‌ రేసులో ఇండియన్‌ బ్యూటీ !

మిస్ వరల్డ్ ఫైనల్స్‌ రేసులో ఇండియన్‌ బ్యూటీ !

Hello Telugu - Sini Shetty

Sini Shetty: ప్రతిష్టాత్మక విస్ వరల్డ్ ఫైనల్స్ లో ఇండియన్ బ్యూటీ సినీ శెట్టి నిలిచారు. కర్ణాటకకు చెందిన 21ఏళ్ళ కన్నడ బ్యూటీ టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. అందం, అభినయం, డ్యాన్స్, ఇలా అన్ని విభాగాల్లో తన ప్రతిభను చూపిస్తూ పోటీలో మందంజలో కొనసాగుతోంది. 1994లో మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ భారతీయుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ కిరీటాన్ని ఆమె అందుకుని ఇప్పటికి మూడు దశాబ్దాలు అవుతుంది. ఈ సందర్భంగా 2024 మిస్‌ వరల్డ్‌ ‘టాలెంట్ ఫైనల్స్’ రౌండ్‌ లో ఐశ్వర్యారాయ్‌ హిట్‌ సాంగ్స్‌కు ‘సినీ శెట్టి’ డ్యాన్స్‌ చేశారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా నుంచి నింబుడా సాంగ్‌తో తాల్, బంటీ ఔర్ బబ్లీ వంటి మూవీలలోని హిట్‌ పాటలకు అద్భుతమైన డ్యాన్స్‌ చేసి ఐశ్వర్యకు అంకితం చేశారు సినీ శెట్టి. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీనితో సినీ శెట్టికి(Sini Shetty) అభిమానులు, నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Sini Shetty Final Race in Miss World

సుమారు 28 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా నిర్వహిస్తున్న 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌… ఫిబ్రవరి 18న ప్రారంభమై మార్చి 9 వరకు కొనసాగుతుంది. 71వ మిస్ వరల్డ్‌ పోటీల్లో 130కి పైగా దేశాల నుంచి ముద్దుగుమ్మలు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. వీరిలో భారత్‌ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి టాప్ 20లో చోటు దక్కించుకుని మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. ఐశ్వర్య వారసత్వానికి గుర్తుగా భారతీయ శాస్త్రీయ, బాలీవుడ్ నృత్య రీతుల కలయికతో సినీ శెట్టి నృత్యం చేసింది. దీనితో పలువురు ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. మార్చి 9న ముంబైలో జరగనున్న మిస్ వరల్డ్ 2024 ఫైనల్‌ పై అందరి దృష్టి ఉంది. ఫైనల్‌ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 2017లో మానుషి చిల్లర్‌ ‘మిస్‌ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకున్నారు. 2024లో మన సినీ శెట్టి కూడా ఆ కిరీటాన్ని తప్పకుండా అందుకుంటారని ఊహాగానాలు మొదలయ్యాయి.

Also Read : Harika Narayan: ప్రియుడి పెళ్ళాడబోతున్న టాలీవుడ్ సింగర్ హారికా నారాయణ్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com